కెరీర్ ఇచ్చిన ఇండస్ట్రీ మీద నిందలు వేస్తావా.. రాధికకు పాయల్ స్ట్రాంగ్ కౌంటర్
రాధికా ఆప్టే తెలుగు చిత్ర పరిశ్రమపై చేసిన వ్యాఖ్యల వివాదంలోకి ‘ఆర్‌ఎక్స్ 100’ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ తనకు గుర్తింపు, భద్రత, మంచి భవిష్యత్తును అందించిందని పేర్కొన్నారు. కెరీర్‌కు అవకాశాలు ఇచ్చిన పరిశ్రమను ఇష్టానుసారం విమర్శించడం సరికాదని హితవు పలికారు. తెలుగు నటిగా తాను గర్వపడుతున్నానని, కష్టకాలంలో అండగా నిలిచిన టాలీవుడ్‌కు ఎప్పుడూ మద్దతుగా ఉంటానని తెలిపారు.
చిత్ర పరిశ్రమలో ఏ భాషలోనైనా సరే.. తమకు లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీని, అన్నం పెట్టిన పరిశ్రమను గౌరవించడం ప్రతి నటీనటుడి బాధ్యత. కానీ ఈమధ్య కాలంలో కొందరు హీరోయిన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. తమ కెరీర్ ప్రారంభంలో అవకాశాలు ఇచ్చి.. భారీ పారితోషికాలు ఇచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమపై ఇప్పుడు ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ అడియన్స్ సదరు తారలపై మండిపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ , సౌత్ నటి రాధికా ఆప్టే ఇటీవల అక్క సినిమా ప్రమోషన్లలో చేసిన కొన్ని వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగు సినిమా పరిశ్రమపై ఆమె చేసిన కామెంట్స్‌పై ఇప్పటికే నిర్మాత ఎస్కేఎన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వ్యవహారం పై ఆర్‌ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ తీవ్రంగా స్పందించారు. టాలీవుడ్‌కు అండగా నిలుస్తూ రాధికా ఆప్టేకు గట్టి కౌంటర్ ఇచ్చారు. రాధికా ఆప్టే ఇటీవల ఓ ఇంటర్వ్యూలలో సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి, ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో నటీమణుల పాత్రల గురించి చేసిన కొన్ని కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటులకు, ముఖ్యంగా హీరోయిన్లకు సరైన ప్రాధాన్యత దక్కదని, కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటారనే రీతిలో ఆమె మాట్లాడిన తీరుపై టాలీవుడ్ ప్రముఖులు , అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పాయల్ రాజ్‌పుత్ ఈ వివాదంపై స్పందించారు. తెలుగు ఇండస్ట్రీ తనకు ఎంతో పేరును, గుర్తింపును, భద్రతను ఇచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. కెరీర్ ఇచ్చిన పరిశ్రమపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో క్రమశిక్షణతో కూడుకున్నదని అన్నారు. మనకు మంచి జీవితాన్ని, భవిష్యత్తును ఇచ్చిన ఇండస్ట్రీ గురించి ఇష్టానుసారం మాట్లాడటం సరైన పద్ధతి కాదంటూ పాయల్ రాజ్‌పుత్ రాధికా ఆప్టేకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను గర్వించదగ్గ ఒక తెలుగు నటిగా టాలీవుడ్‌లో కొనసాగుతున్నానని, ఇక్కడి ప్రేక్షకులు చూపించే ప్రేమను ఎప్పటికీ మరచిపోలేనని పాయల్ చెప్పుకొచ్చారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ఈ పరిశ్రమకు తానెప్పుడూ వెన్నుదన్నుగా ఉంటానంటూ పాయల్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఏ ఇండస్ట్రీ అయినా అక్కడి సంస్కృతిని, శ్రమను గౌరవించాలని పాయల్ చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ అభిమానులు పాయల్ రాజ్‌పుత్ తీసుకున్న ఈ స్టాండ్‌ను ప్రశంసిస్తూ ఆమెకు పూర్తి మద్దతు తెలుపుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంగారం కొంటున్నారా? జాగ్రత్త.. మార్కెట్లో కొత్త తరహా కల్తీ మోసం
దీపావళికి పిల్లలకు డబ్బులు ఇస్తున్నారా? ట్యాక్స్ రూల్స్ ఇవే!
బంగాళాఖాతంలో మరో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్.. మళ్లీ భారీ వర్షాలు తప్పవా?
Vijay Sethupathi: ఎమ్మీ అవార్డుల తొలి భారతీయ ప్రెజంటర్‌గా.. హీరో విజయ్ సేతుపతి రికార్డు
ప్యాసింజర్ లగేజ్ చెక్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్
మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?
హాస్టల్ గదుల్లో నాగుపాములు, తేళ్లు..విద్యార్థినులను కరిచిన ఎలుకలు
డైరెక్టర్ అవుదామనుకున్నాడు.. కట్ చేస్తే దొంగయ్యాడు!
గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఇక ఓటీపీతో పని లేదు!
ఆ ఇల్లే ఒక పాముల పుట్ట.. అడుగడుగునా పాము గుడ్లే!
చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!

