AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Sethupathi: ఎమ్మీ అవార్డుల తొలి భారతీయ ప్రెజంటర్‌గా.. హీరో విజయ్ సేతుపతి రికార్డు

Vijay Sethupathi: ఎమ్మీ అవార్డుల తొలి భారతీయ ప్రెజంటర్‌గా.. హీరో విజయ్ సేతుపతి రికార్డు

Phani CH
|

Updated on: Nov 06, 2026 | 8:26 PM

Share

తమిళ నటుడు విజయ్‌ సేతుపతి మరో అరుదైన ఘనత సాధించబోతున్నట్లు సమాచారం. 2026 నవంబర్‌ 23న న్యూయార్క్‌లో జరగనున్న 54వ ఇంటర్నేషనల్‌ ఎమ్మీ అవార్డుల వేడుకలో ఆయన అవార్డు ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఘనత సాధించే తొలి భారతీయ నటుడిగా నిలవనున్నారని కథనాలు చెబుతున్నాయి. మరోవైపు ఆయన నటించిన ‘మహారాజా’ సినిమాను ఇంగ్లిష్‌లో రీమేక్‌ చేసేందుకు హాలీవుడ్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకోబోతున్నారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా, తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ఈ నటుడు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినీ ప్రతిభకు ప్రతినిధిగా నిలవబోతున్నారు. 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుకలో అవార్డు ప్రెజెంటర్‌గా వ్యవహరించే అవకాశాన్ని దక్కించుకున్నారు. నవంబర్ 23, 2026న న్యూయార్క్‌లో 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుక జరగనుంది. ఈ వేడుకలో అవార్డులు అందించే ప్రెజెంటర్లలో విజయ్ సేతుపతి కూడా ఒకరిగా ఉండనున్నారు. అంతే కాదు ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా విజయ్ సేతుపతి చరిత్ర సృష్టించబోతున్నారు. ఇంటర్నేషనల్ ఎమ్మీ వేడుకలో ప్రెజెంటర్‌గా వ్యవహరించడం విజయ్‌కు ప్రత్యేకమైన గుర్తింపుగా నిలవనుంది. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ ప్రతిభకు మరిన్ని అవకాశాలు కల్పించడంలో నిర్మాత, ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డు సభ్యురాలు కవితా గుప్తా కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024లో హాస్యనటుడు వీర్ దాస్‌ను ఇంటర్నేషనల్ ఎమ్మీ వేడుకకు హోస్ట్‌గా తీసుకురావడంలోనూ ఆమె పాత్ర ఉంది. ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘మహారాజా’ సినిమా ఇప్పుడు హాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. 2024లో విడుదలైన ఈ తమిళ థ్రిల్లర్‌ను ఇంగ్లీష్‌లో రీమేక్ చేసేందుకు ఓ హాలీవుడ్ ఏజెన్సీ ప్రయత్నాలు చేస్తోంది. చైనాలో కూడా మహారాజ సినిమాకు మంచి స్పందన వచ్చింది. దాంతో హాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అనిరుధ్ సక్సెస్ కారణం ధనుష్‌! ఐశ్వర్య రజినీ కామెంట్స్ వైరల్

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లోకి రోహిత్ రీ ఎంట్రీ! అభిజిత్ ట్వీట్‌తో పెరిగిన అంచనాలు..

Ramayana Part 1: హనుమాన్ ఎంట్రీ.. క్లైమాక్స్‌లో గూస్ బంప్స్‌ పక్కా..

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లో రోహిత్‌కు అవమానం! AV వేయకపోవడానికి అసలు కారణం ఇదేనా..

60 ఏళ్ల వయసులో పెళ్లి.. విడాలకుల లొల్లి! బాధనంతా బయటపెట్టిన నటుడు

Follow Us