అనిరుధ్ సక్సెస్ కారణం ధనుష్! ఐశ్వర్య రజినీ కామెంట్స్ వైరల్
అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా ఎదగడం వెనుక ధనుష్ కీలక పాత్ర ఉందని ఐశ్వర్య రజనీకాంత్ గతంలో వెల్లడించిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. అనిరుధ్‌ను పైచదువుల కోసం సింగపూర్ పంపించాలని కుటుంబం భావించిన సమయంలో ధనుష్ అతని ప్రతిభను గుర్తించి ఇండియాలోనే ఉండేలా ఒప్పించారని తెలిపారు. తొలి కీబోర్డ్ కొనివ్వడం నుంచి ‘3’ సినిమాతో పరిచయం చేయడం వరకు ధనుష్ అండగా నిలిచారని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇండియన్ సినీ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ కెరీర్ వెనుక ఎవరున్నారన్న విషయంపై గతంలో రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య చేసిన కామెంట్స్ నెట్టింట మళ్లీ వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ ఫ్యామిలీకి దగ్గరి బంధువైనప్పటికీ, అనిరుధ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి గానీ, ఇంతటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కావడానికి గానీ తన ప్రమేయం ఏమాత్రం లేదని ఆమె స్పష్టం చేశారు. ఆ క్రెడిట్ అంతా నూటికి నూరు శాతం కేవలం హీరో ధనుష్‌కే దక్కుతుందని కుండబద్దలు కొట్టారు. ఓ ఇంటర్వ్యూలో అనిరుధ్ సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ ఐశ్వర్య నాటి కీలక సంఘటనలను గుర్తుచేసుకున్నారు. “అనిరుధ్ ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఉండటం చూస్తుంటే నాకు గర్వంగా ఉంటుంది. నిజానికి వాడు సినీ పరిశ్రమలోకి రావాలని వాళ్ల పేరెంట్స్ అనుకోలేదు. పైచదువుల కోసం అనిరుధ్‌ను సింగపూర్ పంపించాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆ సమయంలో ధనుష్ రంగంలోకి దిగి అనిరుధ్‌లోని అసాధారణ సంగీత ప్రతిభను గుర్తించాడు. ‘వీడిలో మంచి సత్తా ఉంది, నన్ను నమ్మండి’ అని అనిరుధ్ తల్లిదండ్రులతో గట్టిగా మాట్లాడి, ఒప్పించి మరీ వాడిని ఇండియాలోనే ఆపేశాడు” అని ఆమె తెలిపారు. అనిరుధ్‌ను ఇండియాలో ఆపడమే కాకుండా, సంగీత రంగంలో అతనికి బలమైన పునాది వేసింది కూడా ధనుషేనని ఐశ్వర్య వెల్లడించారు. అనిరుధ్‌కి ఫస్ట్ కీబోర్డ్ కొనివ్వడం దగ్గర్నుంచి.. ‘3’ సినిమాలో సంగీత దర్శకుడిగా అవకాశం కల్పించి సినిమా ప్రపంచానికి పరిచయం చేసే వరకు ప్రతి విషయంలో ధనుష్ అండగా నిలబడ్డాడని చెప్పారు. అలా ధనుష్ పెట్టుకున్న నమ్మకమే అనిరుధ్ నేడు దేశవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదగడానికి కారణమైందని ఆమె పేర్కొన్నారు. అయితే ఇంతటి లైఫ్ ఇచ్చిన ధనుష్‌ను.. అనిరుధ్ తన పెళ్లి వేడుకకు పిలవలేదంటూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారం వెనుక నిజమెంతో తెలియనప్పటికీ.. ఐశ్వర్య గతంలో మాట్లాడిన ఈ కామెంట్స్ మాత్రం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లోకి రోహిత్ రీ ఎంట్రీ! అభిజిత్ ట్వీట్‌తో పెరిగిన అంచనాలు..
Ramayana Part 1: హనుమాన్ ఎంట్రీ.. క్లైమాక్స్‌లో గూస్ బంప్స్ పక్కా..
Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లో రోహిత్‌కు అవమానం! AV వేయకపోవడానికి అసలు కారణం ఇదేనా..
60 ఏళ్ల వయసులో పెళ్లి.. విడాలకుల లొల్లి! బాధనంతా బయటపెట్టిన నటుడు
ప్యాసింజర్ లగేజ్ చెక్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్
మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?
హాస్టల్ గదుల్లో నాగుపాములు, తేళ్లు..విద్యార్థినులను కరిచిన ఎలుకలు
డైరెక్టర్ అవుదామనుకున్నాడు.. కట్ చేస్తే దొంగయ్యాడు!
గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఇక ఓటీపీతో పని లేదు!
ఆ ఇల్లే ఒక పాముల పుట్ట.. అడుగడుగునా పాము గుడ్లే!
చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!

