రామాయణ పార్ట్ 1 రిలీజ్ అయిన వేళ.. బాంబు పేల్చిన ప్రొడ్యూసర్
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటించిన ‘రామాయణం’ రెండో భాగం విడుదల వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. తొలుత 2027 దీపావళికి పార్ట్ 2ను విడుదల చేస్తామని చెప్పిన చిత్రబృందం, ఇప్పుడు 2028లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్ర తెలిపారు. భారీ చిత్రానికి మరింత సమయం కేటాయించి, నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ప్రస్తుతం భారతీయ సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన రామాయణ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ రామాయణ పార్ట్ 1 ఇప్పుడు అందరినీ ఆకట్టుకంటోంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్ర ఉన్నట్టుండి షాకించ్చారు. రామాయణ పార్ట్-1 రిలీజైన ఏడాదికే పార్ట్-2ను తీసుకొస్తామని గతంలో ఈ మూవీ టీం చెప్పుకొచ్చింది. అంటే 2027 దీపావళికి పార్ట్ 2 ను రిలీజ్ చేస్తామని డైరెక్టర్ , ప్రొడ్యూసర్ చెబుతూ వచ్చారు. కానీ బ్యాకెండ్ ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఇప్పుడా మాట మార్చేశారు. రామాయణ పార్ట్ 2 ను మరో ఏడాదికి అంటే.. 2028లో తీసుకురావాలని అనుకుంటున్నట్లు నమిత్ మల్హోత్ర తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.”రామాయణ పార్ట్-1’పై ప్రేక్షకులకు ఉన్న ఉత్సాహం, ఆసక్తిని గమనించాం. రెండో భాగాన్ని విడుదల చేసే విషయంలో మరికొంత సమయం తీసుకోవాలని నిర్ణయించామంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఫస్ట్ పార్ట్ కోసం తగిన సమయాన్ని కేటాయిస్తూ శ్రద్ధగా పనిచేశామని.. అదే విధంగా రెండో భాగానికి మరింత సమయం అవసరమనిపించిందని నమిత్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇంతటి భారీ చిత్రానికి పూర్తి న్యాయం చేయడానికి ఏడాది కాలం అదనంగా తీసుకోవడంలో తప్పులేదని.. పార్ట్-2 మీ ముందుకు వచ్చినప్పుడు మరింత అద్భుతాన్ని చూసిన అనుభూతిని కలుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఈ న్యూస్ కాస్తా ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాధికాకు.. SKN దిమ్మతిరిగే కౌంటర్
బాలీవుడ్ హీరోకు బెదిరింపు కాల్స్.. కోట్లు డిమాండ్ చూస్తూ ధమ్కీ
బాలు ప్యాంటుకి 2nd వరల్డ్ వార్‌కి లింకేటో తెలుసా? ఇట్రెస్టింగ్ విషయాన్ని చెప్పిన రేణు దేశాయ్
ప్యాసింజర్ లగేజ్ చెక్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్
మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?
హాస్టల్ గదుల్లో నాగుపాములు, తేళ్లు..విద్యార్థినులను కరిచిన ఎలుకలు
డైరెక్టర్ అవుదామనుకున్నాడు.. కట్ చేస్తే దొంగయ్యాడు!
గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఇక ఓటీపీతో పని లేదు!
ఆ ఇల్లే ఒక పాముల పుట్ట.. అడుగడుగునా పాము గుడ్లే!
చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!

