AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమానే బలిపశువా.. రాప్తాడు ఘటనపై వంగా సంచలన ట్వీట్

సినిమానే బలిపశువా.. రాప్తాడు ఘటనపై వంగా సంచలన ట్వీట్

Phani CH
|

Updated on: Nov 06, 2026 | 6:12 PM

Share

అనంతపురం జిల్లా రాప్తాడులో తరగతి గదిలో విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన ఘటనపై దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా స్పందించారు. ఇలాంటి నేరాలకు సినిమాలే కారణమంటూ విమర్శలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విషాద ఘటనను అడ్డం పెట్టుకుని వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం సరికాదని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ముందుగా బాధితుల పట్ల సానుభూతి చూపించి, అసలు సమస్యపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పాఠశాల తరగతి గదిలో ఉన్న ఓ విద్యార్థినిపై రంపం తో దాడి చేయడం అందరినీ కలవరానికి గురి చేసింది. ప్రస్తుతం బాధితురాలు బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అలాగే ఈ ఘోరానికి పాల్పడిన నిందితుడు పోలీసుల కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. కానీ అతడు చేసిన ఈ హేయమైన చర్యను అందరూ ఖండిస్తున్నారు. సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఘటనపై తీవ్రంగా రియాక్టవుతున్నారు. అయితే రాప్తాడు ఘటనకు సినిమాలే కారణమంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. సినిమాల్లోని హింసాత్మక సీన్లే యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శకులపై ఇప్పటికే వేణు ఊడుగుల రియాక్టయ్యారు. తాజాగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా.. ఈ విమర్శలపై రియాక్ట్ అయ్యారు. విషాదాన్ని అడ్డం పెట్టుకుని వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ పెట్టారు. సందీప్ రెడ్డి వంగా తన పోస్ట్‌లో ఏం రాసుకొచ్చారంటే.. ” సమాజంలో ఎప్పుడైనా ఇలాంటి భయానక నేరాలు జరిగినప్పుడు, మన మొదటి రియాక్షన్ బాధితుల పట్ల సానుభూతి చూపించడం, అసలు సమస్య ఏమిటో లోతుగా విశ్లేషించడం కావాలి. అంతేతప్ప, ప్రతిసారీ సినిమాలను సులభమైన బలిపశువులా మార్చడం సరికాదు. మీ ఆందోళన అంతా బాధితుల కుటుంబాల గురించి కాదు.. ఒక ఘోరమైన విషాదాన్ని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి. దీనిని ఒక డర్టీ అవకాశంగా మల్చుకుంటున్నారు. కొందరు విఫలమైన నటులు, దర్శకులు, నిర్మాతలు.. ఎప్పుడెప్పుడు ఎవరెవరిపై విమర్శలు చేద్దామా అని ఎదురుచూస్తుంటారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు తామే.. ఏదో గొప్ప సామాజిక వేత్తలా బిల్డప్ ఇస్తూ ఇతరుల పనులపై పడతారు. ఇది సరికాదు. చివరగా.. నేను చెబుతుంది ఒకటే..! ఒక విషాదం అనేది కేవలం సానుభూతిని మాత్రమే కోరుకుంటుంది కానీ, ఇలాంటి అవకాశవాదాన్ని కాదు. దయచేసి రెండింటి మధ్య ఉన్న తేడాను తెలుసుకోండి” అంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు సందీప్ రెడ్డి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రష్యా సైన్యంలో తెలంగాణ యువకులు!

ఆ ఇల్లే ఒక పాముల పుట్ట.. అడుగడుగునా పాము గుడ్లే!

చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!

1 కిలో వెండి ధర 10 గ్రాముల బంగారంతో సమానమవుతుందా?

దొంగ స్వాముల మోసం.. బుద్ధి చెప్పిన గ్రామస్తులు

Follow Us