ఆ ఇల్లే ఒక పాముల పుట్ట.. అడుగడుగునా పాము గుడ్లే!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లా కహార్కా గ్రామంలో ఓ ఇంట్లో వరుసగా పాములు కనిపించడం కలకలం రేపింది. కపిల్ త్యాగి ఇంట్లో కేవలం ఏడు రోజుల్లోనే 30 నాగుపాములు బయటపడటంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇంటి ఆవరణలో తవ్వకాలు జరపగా 100కు పైగా పాము గుడ్లు కనిపించాయి. అటవీశాఖ సిబ్బంది పాములను పట్టుకుని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు.
సాధారణంగా నాగుపాములు అప్పుడప్పుడు జనావాసాల్లోకి రావడం చూస్తుంటాం. కానీ ఒకే ఇంట్లోకి ప్రతిరోజూ పాములు రావడం ఎక్కడపడితే అక్కడ గుడ్లు పెట్టడం ఎక్కడైనా చూశారా.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్ జిల్లా కహార్కా గ్రామంలో అలాంటి ఘటనే జరిగింది. బాగ్‌పత్ జిల్లా కహార్కా గ్రామానికి చెందిన కపిల్ త్యాగి అనే వ్యక్తి నివాసంలోకి గత ఎనిమిదేళ్లుగా తరచూ పాములు వస్తూనే ఉన్నాయి. అయితే, గడిచిన వారం రోజుల వ్యవధిలోనే ఈ సమస్య మరింత ఎక్కువైంది. కేవలం ఏడు రోజుల్లోనే ఏకంగా 30 నాగుపాములు ఆ ఇంట్లోకి రావడం కలకలం రేపింది. ఇవన్నీ అత్యంత విషపూరితమైన నాగుపాములు కావడంతో కుటుంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారు కూడా భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఆ పాములను సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు. పాముల సంఖ్య హఠాత్తుగా పెరగడంతో అనుమానం వచ్చిన కపిల్, తన ఇంటి ఆవరణను తవ్వించాలని నిర్ణయించుకున్నారు. అలా ఇంటి పరిసరాల్లో తవ్వకాలు జరిపారు. ఇంకేముంది… ఆ ఇంటి ఆవరణలో ఏకంగా 100కు పైగా పాము గుడ్లు బయటపడ్డాయి. దీంతో ఆ ఇంట్లో నివసిస్తున్న వారు రాత్రిపూట కూడా నిద్ర లేకుండా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా అటవీ శాఖ అధికారి ఆ ఇంటిని పరిశీలించారు. బాధితులకు తాము అండగా ఉంటామని హామీ ఇస్తూనే, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!
1 కిలో వెండి ధర 10 గ్రాముల బంగారంతో సమానమవుతుందా?
దొంగ స్వాముల మోసం.. బుద్ధి చెప్పిన గ్రామస్తులు
కాశీ వారాహి అమ్మవారి విగ్రహానికి మళ్లీ చెమటలు!
EPFO: ఇకపై వాట్సప్ నుంచే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు!
ఆ ఇల్లే ఒక పాముల పుట్ట.. అడుగడుగునా పాము గుడ్లే!
చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!
కాశీ వారాహి అమ్మవారి విగ్రహానికి మళ్లీ చెమటలు!
48 ఏళ్లుగా నీళ్లే తాగలేదట.. మరి ఏం తాగారో తెలుసా!
కూరగాయల సంచిలో నల్లత్రాచు.. భయంతో పరుగులు తీసిన వ్యాపారులు
వరద ఉధృతికి పడవలా కొట్టుకుపోయిన లారీ..
నెటిజన్ల మనసులు గెలుచుకున్న కేంద్ర మాజీ మంత్రి!

