AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఇకపై వాట్సప్‌ నుంచే  పీఎఫ్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు!

EPFO: ఇకపై వాట్సప్‌ నుంచే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు!

Phani CH
|

Updated on: Nov 04, 2026 | 10:06 AM

Share

పీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్‌వో కొత్త వాట్సప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి వాట్సప్ మెసేజ్ పంపి పీఎఫ్ బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు, పాస్‌బుక్ వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం +91 87964 41800 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపాలి. ఓటీపీ ధ్రువీకరణ తర్వాత వివరాలు పొందవచ్చు. మరోవైపు, ఆధార్‌తో ధ్రువీకరించిన కొన్ని నిరుపయోగ ఖాతాల్లోని నగదును నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది.

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో చందాదారులకు మరో గుడ్‌న్యూస్‌. పీఎఫ్ సేవల లావాదేవీలను మరింత సరళతరం చేస్తూ ఈపీఎఫ్‌వో సరికొత్త వాట్సప్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈపీఎఫ్‌వో 74వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఈ నూతన సేవలను ప్రారంభించారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో వద్ద 8 కోట్లకు పైగా సభ్యుల భాగస్వామ్యంతో దాదాపు రూ.32 లక్షల కోట్ల కార్పస్ నిధి ఉందని మంత్రి తెలిపారు. మీ పీఎఫ్‌ ఖాతాలో నమోదైన మొబైల్‌ నంబర్‌ ద్వారానే ఈ సేవలు పొందే అవకాశం ఉంది. వాట్సప్‌ ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్, చివరి 5 లావాదేవీలు, పీఎఫ్ పాస్‌బుక్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే ప్రధాన్‌ త్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన కి సంబంధించిన సందేహాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు. వాట్సప్‌లో మీ పీఎఫ్‌ బ్యాలెన్స్ చెక్ చేసుకోడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి +91 87964 41800 నంబర్‌కు ‘Hi’ అని వాట్సప్ మెసేజ్ పంపాలి. వచ్చిన మెసేజ్‌లో మీకు కావాల్సిన భాషను ఎంచుకోవాలి. అనంతరం స్క్రీన్‌పై కనిపించే మెనూలో “తాజా పీఎఫ్‌ బ్యాలెన్స్‌” ఎంపికను ఎంచుకోవాలి. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. వెంటనే మీ మొత్తం బ్యాలెన్స్, ఉద్యోగి-యజమాని వాటా వివరాలు, పెన్షన్ ఫండ్ మరియు చివరి లావాదేవీ వివరాలు వస్తాయి. పాస్‌బుక్ పిడిఎఫ్ డౌన్‌లోడ్ చేసుకుని, తెరవడానికి మీ పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆధార్‌తో వెరిఫై అయి, నిరుపయోగంగా ఉన్న పీఎఫ్ ఖాతాల్లో రూ.1000 వరకు బ్యాలెన్స్ ఉంటే, ఎలాంటి క్లెయిమ్ దరఖాస్తు లేకుండానే ఆ డబ్బును ఈపీఎఫ్‌ఓ నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. దీనివల్ల దాదాపు లక్ష ఖాతాల్లోని రూ.5 కోట్ల నిధులు జమ కానున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Charan-Sukumar Film: చరణ్‌ హీరోయిన్‌గా తెలుగమ్మాయి.. ఇంతకీ ఎవరీ బ్యూటీ.. అంటే..

Jailer 2: కలెక్షన్స్‌లో జైలర్ 2 దిమ్మతిరిగే రికార్డ్.. దెబ్బకు ‘ఛావా’ అవుట్!

Jailer 2 OTT: థియేటర్లలో ఉండగానే.. OTTలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’..

Subhashini: KCR వల్లే క్యాన్సర్‌ నుంచి బయటపడ్డా.. ఇండస్ట్రీలో అందరూ మారారు అంటూ.. సుభాషిణి ఎమోషనల్

రైతు బిడ్డకు గిట్టుబాటు అయింది! 8 వారాలకు లక్షల్లో రెమ్యునరేషన్

Follow Us