AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Charan-Sukumar Film: చరణ్‌ హీరోయిన్‌గా తెలుగమ్మాయి.. ఇంతకీ ఎవరీ బ్యూటీ.. అంటే..

Charan-Sukumar Film: చరణ్‌ హీరోయిన్‌గా తెలుగమ్మాయి.. ఇంతకీ ఎవరీ బ్యూటీ.. అంటే..

Phani CH
|

Updated on: Nov 04, 2026 | 10:04 AM

Share

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సారా అర్జున్‌తో పాటు తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి మరో హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికాలో పుట్టి పెరిగిన సాత్వికకు తెలుగు కుటుంబ నేపథ్యం ఉంది. క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉన్న ఆమె, దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కానుంది. నాగచైతన్య తదుపరి చిత్రంలోనూ ఆమె పేరు వినిపిస్తోంది.

రంగస్థలం లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత మరోసారి సుకుమార్‌తో జతకట్టారు మెగా హీరో. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీలో హీరోయిన్‌ ఎవరనేదానిపై అప్పుడే చర్చ మొదలైంది.ఇటీవలే దురంధర్ ఫేమ్ సారా అర్జున్‌తో చరణ్ ఫోటో షూట్ ఫినిష్ అయిందని తెలుస్తోంది. ఈమెతో పాటే తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి చరణ్ పక్కన మరో హీరోయిన్‌ గా చేస్తున్నారనే లీక్ బయటికి వచ్చింది.దీంతో ఈమె గురించి నెట్టింట ఆరాలు మొదలయ్యాయి. ఇక సాత్విక అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ, ఆమె కుటుంబ మూలాలు చెన్నైకి చెందిన తెలుగు కుటుంబానికి చెందినవి. ఈమె అమెరికాలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు.క్లాసికల్ డాన్స్‌లో మంచి ప్రవేశం ఉన్న ప్రతిభావంతురాలు. సాత్విక చేసే డాన్స్ రీల్స్ ఇన్ స్టాగ్రామ్‌లో చాలా పాపులర్. ప్రస్తుతం సాత్విక పవన్ సాదినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. మొదటి సినిమా ఇంకా విడుదల కాకముందే, ఈమె స్క్రీన్ ప్రెజెన్స్, నటనపై పట్టు చూసి సుకుమార్ తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారని టాక్. అలాగే నాగచైతన్య 25వ సినిమాలోనూ ఈమె పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jailer 2: కలెక్షన్స్‌లో జైలర్ 2 దిమ్మతిరిగే రికార్డ్.. దెబ్బకు ‘ఛావా’ అవుట్!

Jailer 2 OTT: థియేటర్లలో ఉండగానే.. OTTలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’..

Subhashini: KCR వల్లే క్యాన్సర్‌ నుంచి బయటపడ్డా.. ఇండస్ట్రీలో అందరూ మారారు అంటూ.. సుభాషిణి ఎమోషనల్

రైతు బిడ్డకు గిట్టుబాటు అయింది! 8 వారాలకు లక్షల్లో రెమ్యునరేషన్

గిల్, పీవీ సింధు నుదిటి పై వింత పరికరం.. అథ్లెట్ల కోసం అదిరిపోయే టెక్నాలజీ!

Follow Us