AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతు బిడ్డకు గిట్టుబాటు అయింది! 8 వారాలకు లక్షల్లో రెమ్యునరేషన్

రైతు బిడ్డకు గిట్టుబాటు అయింది! 8 వారాలకు లక్షల్లో రెమ్యునరేషన్

Phani CH
|

Updated on: Nov 04, 2026 | 9:57 AM

Share

బిగ్‌బాస్‌ తెలుగు 10లో ఎనిమిదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ప్రముఖ ఫోక్‌ సింగర్‌ ఝాన్సీ హౌస్‌ నుంచి బయటకు వచ్చారు. ముఖేష్‌ సూపర్‌ పవర్‌ వినియోగంతో సుధీర్‌ను సేవ్‌ చేయడం, ఝాన్సీ దగ్గరున్న సేవింగ్‌ పవర్‌ పోవడం ఆమె ఎలిమినేషన్‌కు కారణమైందనే చర్చ జరుగుతోంది. ఎనిమిది వారాల పారితోషికంతో పాటు అగ్నిపరీక్ష ద్వారా ఆమెకు సుమారు రూ.6 లక్షలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 10 ఎవరి ఊహలు, అంచనాలకు అందడం లేదు. ఎప్పటికప్పుడు ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతోన్న ఈ రియాలిటీ షో ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ అందిస్తోంది. అదే సమయంలో కంటెస్టెంట్లకు మాత్రం గుండె దడ పుట్టిస్తోంది. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో అని నిత్యం కంటెస్టెంట్లు టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా ఎలిమినేషన్‌ విషయంలో బిగ్ బాస్ మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏడో వారంలో డబుల్ ఎలిమినేషన్ తో ఇద్దరి కంటెస్టెంట్లను బయటకు పంపించిన బిగ్ బాస్ ఇప్పుడు ఎనిమిదో వారంలోనూ అదే నిర్ణయం తీసుకున్నాడు. తక్కువ ఓట్లు వచ్చిన ఇద్దరు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి బయటకు పంపించారు. అందులో ప్రముఖ ఫోక్ సింగర్ ఝాన్సీ కూడా ఉన్నారు. ఎనిమిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా సుధీర్‌కు తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో అతడిని బయటకు పంపే ప్రయత్నం జరగగా, ముకేష్ తన దగ్గరున్న సూపర్ పవర్‌తో.. ఝాన్సీ దగ్గర నామినేషన్స్ నుంచి సేవ్‌ అయ్యే పవర్‌ను రీస్టోర్ చేశాడు. ఆ పవర్‌ను సుధీర్‌ను సేవ్ చేసేందుకు వాడాలని ఝాన్సీ దగ్గర కండీషన్ పెట్టాడు. ముఖేష్ వ్యూహంలో భాగంగా సింగర్ ఝాన్సీ తన చేతికొచ్చిన సేవింగ్ పవర్‌ను పోగొట్టుకున్నట్టు అయింది. ఈ నిర్ణయమే చివరకు ఆమెకు శాపంగా మారింది. ఒకవేళ ఆ పవర్ ఆమె దగ్గరే ఉండి ఉంటే తనను తాను కాపాడుకునే అవకాశం ఉండేది. కానీ ఊహించని ఈ పరిణామంతో ఎనిమిదో వారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా ఝాన్సీ బిగ్ బాస్ హౌస్ ను వీడాల్సి వచ్చింది. అగ్ని పరీక్ష సీజన్ 2 లో పాల్గొని సత్తా చాటింది సింగర్ ఝాన్సీ. ఆ తర్వాత మెయిన్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. కామనర్‌గా వచ్చినప్పటికీ తనదైన ఆటతో అభిమానుల మన్ననలు అందుకుంది. సేఫ్ గేమ్ ఆడుతుందని విమర్శలు వచ్చినా తన దైన మాట తీరు, టాస్కుల్లో ఎఫర్ట్, హౌస్‌లో తన అభిప్రాయాలను చెప్పే విధానం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఝాన్సీ ఆట తీరు చూసి ఆమె కచ్చితంగా గ్రాండ్ ఫినాలే వరకు వస్తుందనకున్నారు చాలా మంది. అయితే ఇప్పుడు ఎనిమిదో వారంలోనే ఆమె ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. కామనర్‌గా బిగ్ బాస్ హౌస లోకి ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీకి వారానికి సుమారు రూ.70,000 నుండి రూ.75,000 వరకు పారితోషికం లభించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన సుమారు ఎనిమిది వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు సుమారు సుమారు రూ.5.60 నుండి 6 లక్షల వరకు పారితోషికం ఝాన్సీకి దక్కనుందని తెలుస్తోంది. దీంతో పాటు ‘అగ్నిపరీక్ష’ టాస్క్ ద్వారా మరో 50 వేలు ఆమెకు అదనంగా లభించినట్లు సమాచారం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గిల్, పీవీ సింధు నుదిటి పై వింత పరికరం.. అథ్లెట్ల కోసం అదిరిపోయే టెక్నాలజీ!

48 ఏళ్లుగా నీళ్లే తాగలేదట.. మరి ఏం తాగారో తెలుసా!

 

Published on: Nov 04, 2026 09:54 AM
Follow Us