Jailer 2 OTT: థియేటర్లలో ఉండగానే.. OTTలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’..
రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ ఓటీటీ విడుదలపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డిజిటల్ హక్కులను సుమారు రూ.160 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. అంతేకాదు, థియేటర్లలో చూడని 30 నిమిషాల అదనపు ఫుటేజ్ ఓటీటీ వెర్షన్‌లో ఉండనుందని ప్రచారం జరుగుతోంది. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమా ‘జైలర్ 2’. గతంలో వచ్చిన ‘జైలర్’ సినిమాకు ఇది సీక్వెల్. మొదటి భాగాన్ని తెరకెక్కించిన నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ సీక్వెల్ ను కూడా తెరకెక్కించాడు. దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రజనీకాంత్ కెరీర్ లోనే కోలీవుడ్ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డుల కెక్కింది. ఇప్పటివరకు ‘జైలర్ 2’ సినిమాకు సుమారు రూ. 750 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ చాలా చోట్ల ముఖ్యంగా తమిళనాడులో రజనీకాంత్ సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. అయితే ఇంతలోనే జైలర్ 2 సినిమా ఓటీటీలోకి వస్తోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 12 నుంచే జైలర్ 2 సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ ఒకేసారి రజనీకాంత్ మూవీ అందుబాటులోకి రానుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ సుమారు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన జైలర్ 2 సినిమాలో చాలా మంది స్టార్స్ యాక్ట్ ఉన్నారు. రమ్యకృష్ణ, విద్యాబాలన్ మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు, యోగిబాబు, మిర్నా మేనన్, రిత్విక్, మేఘనా రాజ్.. ఇలా ఎంతో మంది స్టార్స్ వివిధ పాత్రలు పోషించారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఇక జైలర్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు తెలుస్తోంది. సుమారు రూ. 160 కోట్లతో ఈ ఓటీటీ డీల్ కుదిరినట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఇక జైలర్ 2 ఓటీటీ వెర్షన్ లో 30 నిమిషాల ఎక్స్ ట్రా ఫుటేజ్ ఉండనుందని తెలుస్తోంది. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, హృతిక్ రోషన్ లకు సంబంధించి కొన్ని అదనపు సన్నివేశాలను ఓటీటీ వెర్షన్ లో జోడించినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Subhashini: KCR వల్లే క్యాన్సర్ నుంచి బయటపడ్డా.. ఇండస్ట్రీలో అందరూ మారారు అంటూ.. సుభాషిణి ఎమోషనల్
రైతు బిడ్డకు గిట్టుబాటు అయింది! 8 వారాలకు లక్షల్లో రెమ్యునరేషన్
గిల్, పీవీ సింధు నుదిటి పై వింత పరికరం.. అథ్లెట్ల కోసం అదిరిపోయే టెక్నాలజీ!
48 ఏళ్లుగా నీళ్లే తాగలేదట.. మరి ఏం తాగారో తెలుసా!
కూరగాయల సంచిలో నల్లత్రాచు.. భయంతో పరుగులు తీసిన వ్యాపారులు
వరద ఉధృతికి పడవలా కొట్టుకుపోయిన లారీ..
నెటిజన్ల మనసులు గెలుచుకున్న కేంద్ర మాజీ మంత్రి!
శభాష్ సీఐ గారు.. కాలుకి సర్జరీ అయినా ఆగని విధి నిర్వహణ
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

