AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యా సైన్యంలో తెలంగాణ యువకులు!

రష్యా సైన్యంలో తెలంగాణ యువకులు!

Phani CH
|

Updated on: Nov 04, 2026 | 10:43 AM

Share

లక్షల్లో జీతాలు వస్తాయనే ఏజెంట్ల మాటలు నమ్మి రష్యా వెళ్లిన ఇద్దరు తెలంగాణ యువకులు యుద్ధ క్షేత్రంలో చిక్కుకున్నారు. కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన ఏజెంట్లు వారిని రష్యా సైన్యంలో చేర్చినట్లు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. కిషన్, రాజ్‌కుమార్‌లను ఉక్రెయిన్ సరిహద్దులకు పంపడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ యువకులకు అక్కడ ఉపాధి దొరకలేదు.. ప్రాణాలకే ముప్పు ఎదురైంది. లక్షల్లో జీతాలు వస్తాయంటూ ఏజెంట్లు చెప్పిన మాయమాటలు నమ్మి అప్పులు చేసి మరీ రష్యా వెళ్లిన యువకులు.. ఇప్పుడు అక్కడి యుద్ధ క్షేత్రంలో చిక్కుకుపోయారు. కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి తీసుకెళ్లిన ఏజెంట్లు.. అక్కడికి చేరుకున్నాక యువకుల చేతుల్లో తుపాకులు పెట్టి మిలిటరీ యూనిఫామ్ వేసి ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి పంపిస్తున్నారు. ప్రాణాలు కాపాడాలంటూ యువకులు రోదిస్తున్నా అక్కడి అధికారుల నుంచి కనికరం కనిపించడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన దొమ్మాటి కిషన్, జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ముక్కెర రాజ్‌కుమార్ ఉపాధి కోసం రష్యా వెళ్లారు. ఏజెంట్ల మాయ మాటలకు ఆశ పడి రష్యా వెళ్లిన ఇద్దరు తెలంగాణ యువకులు ఇప్పుడు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. రష్యాలోని కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని సిరిసిల్లకు చెందిన ఏజెంట్ దార్నం శ్రీనివాస్ వారిని నమ్మించి.. ఒక్కొక్కరి నుంచి రెండున్నర లక్షలు వసూలు చేశాడు. 10మంది యువకులను రష్యా తీసుకెళ్తానని చెప్పిన ఏజెంట్.. అతను మాత్రం కేసుల పేరుతో ఢిల్లీ నుంచే వెనక్కి వచ్చాడు. మిగిలిన యువకులను రష్యా పంపాడు.. వారిలో కొందరు ఎలాగోలా ఇంటికి చేరుకోగా.. మరికొందరు రేపోమాపో రాబోతున్నారు. అయితే.. కిషన్‌, రాజ్‌కుమార్‌ మాత్రం రష్యా సైన్యం చేతిలో చిక్కారు. వీళ్లిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించి.. పౌరసత్వం కల్పించి సైన్యంలో చేర్చారు. రష్యా మిలిటరీ డ్రెస్‌ వేసి, చేతుల్లో తుపాకులు పెట్టి ఉక్రెయిన్ సరిహద్దుల్లో నిలబెట్టటడం షాకిచ్చింది. లబోదిబోమంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన బాధితులు.. ఏజెంట్‌ మోసం చేసినట్టు తెలిపారు. దీంతో.. బాధిత యువకుల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏజెంట్లు చేసిన మోసంతో రష్యాలో తమ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని వాపోతున్నారు. మరోవైపు నారాయణపూర్‌ యువకుడు కిషన్ రష్యా సైన్యంలో చిక్కుకోవడంతో ఇక్కడ కుటుంబ పరిస్థితి హృదయవిదారకంగా మారింది. కిషన్‌కు మూడేళ్ల కుమారుడు ఉండగా.. అతని భార్య ప్రస్తుతం గర్భిణిగా ఉంది. ఈ క్రమంలో.. కుటుంబానికి ఆధారమైన కిషన్ రష్యా యుద్ధక్షేత్రంలో చిక్కుకోవడంతో ఏం జరుగుతుందోనని బంధువులు ఆందోళన చెందుతున్నారు. తన భర్తను ఎలాగైనా క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలంటూ కిషన్‌ భార్య రక్షిత వేడుకుంటోంది. ఇంకోవైపు జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన రాజ్‌కుమార్‌దీ ఇదే పరిస్థితి. రష్యాలో శానిటేషన్‌ ఉద్యోగం, నెలకు లక్షల్లో జీతం అంటూ ఏజెంట్లు ఆశ చూపించారు. లక్షలు చెల్లించి రష్యా వెళ్లగా అక్కడ అడవుల్లో నిర్బంధించి.. పాస్‌పోర్టు, ఫోన్లు స్వాధీనం చేసుకోవడం దిమ్మతిరిగేలా చేసింది. ఆ వెంటనే.. 15రోజులపాటు రష్యా సైనిక శిక్షణ ఇచ్చి ఉక్రెయిన్ సరిహద్దులకు తరలించడం మరింత నివ్వెరపోయేలా చేస్తోంది. ఈ క్రమంలోనే.. తనను యుద్ధ క్షేత్రానికి తీసుకెళ్తున్నారంటూ రాజ్‌కుమార్ తన ఆఖరి వీడియోను కుటుంబ సభ్యులకు పంపారు. మరో మూడు నెలల వరకు ఫోన్లు కూడా ఇవ్వబోరని బాధితులు వారి తల్లిదండ్రులకు చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. తన కొడుకు ప్రాణాలు కాపాడాలంటూ రాజ్‌కుమార్‌ తండ్రి రాజయ్య కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌ను కలిసి వేడుకున్నారు. దీంతో.. విదేశాంగ శాఖ, రష్యాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి బాధితులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. అలాగే.. తన కొడుకును తిరిగి తీసుకురావాలంటూ రాజ్‌కుమార్‌ తల్లి రాజేశ్వరి కన్నీరుమున్నీరు అవుతోంది. మొత్తంగా.. ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల పేరిట రష్యా వెళ్లిన తెలంగాణ యువకులకు అక్కడ సైన్యంలో చేర్చి బంధించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే.. ఏజెంట్ల మాయమాటలకు బలై రష్యా యుద్ధభూమిలో చిక్కుకున్న తెలంగాణ యువకులను క్షేమంగా రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఇల్లే ఒక పాముల పుట్ట.. అడుగడుగునా పాము గుడ్లే!

చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!

1 కిలో వెండి ధర 10 గ్రాముల బంగారంతో సమానమవుతుందా?

దొంగ స్వాముల మోసం.. బుద్ధి చెప్పిన గ్రామస్తులు

కాశీ వారాహి అమ్మవారి విగ్రహానికి మళ్లీ చెమటలు!

Follow Us