రాధికాకు.. SKN దిమ్మతిరిగే కౌంటర్
తెలుగు చిత్ర పరిశ్రమపై నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. టాలీవుడ్ పని విధానం, హీరోయిన్ల ఎంపిక, స్థానిక నటీమణులకు అవకాశాలపై ఆమె చేసిన విమర్శలకు నిర్మాత ఎస్‌కేఎన్ స్పందించారు. నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తామని, కానీ అవకాశాలు ఇచ్చిన పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడటం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఆయన పోస్టుకు కొందరు అభిమానులు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు గత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శిస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమపై నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన కొందరు ఉత్తరాది హీరోయిన్లు, ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమపై విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదంటూ సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో తెలుగు చిత్ర పరిశ్రమలోని పని విధానం, నటీనటుల ఎంపికపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే తెలుగు చిత్ర పరిశ్రమను పురుషాధిక్య పరిశ్రమగా అభివర్ణించారు. వయసు పైబడిన హీరోల సరసన నటించాల్సి రావడం, సినిమా సెట్స్‌లో ప్యాడింగ్స్ ఉపయోగించమని సూచించడం తనకు అసౌకర్యంగా అనిపించిందని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా స్థానిక నటీమణులకు అవకాశాలు ఇవ్వకుండా, తెల్లటి చర్మం ఉందనే కారణంతో ఉత్తరాది హీరోయిన్లను ఎంపిక చేస్తారంటూ విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.గతంలోనూ తాప్సీ పన్ను, పూజా హెగ్డే, జాన్వీ కపూర్ వంటి నటీమణులు దక్షిణాది సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు రాధికా ఆప్టే వ్యాఖ్యలతో మరోసారి తెలుగు సినిమా పరిశ్రమలో ఈ అంశంపై చర్చ మొదలైంది. రాధికా ఆప్టే వ్యాఖ్యలపై నిర్మాత SKN సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అవకాశాలు పొంది, గుర్తింపు సంపాదించుకున్న తర్వాత అదే పరిశ్రమను, ఇక్కడి కథలను, సంస్కృతిని కించపరిచేలా మాట్లాడటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ప్రతి నటుడికి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుందని, అయితే నిర్మాణాత్మక విమర్శకు, అవకాశాలు కల్పించిన పరిశ్రమను తక్కువ చేసి చూపడానికి మధ్య చాలా తేడా ఉందని అన్నారు. తెలుగు, దక్షిణాది చిత్ర పరిశ్రమకు ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపు, కథా విలువలు ఉన్నాయని వివరించారు. ఒక ప్రాంతానికి చెందిన వారికి సహజంగా అనిపించే విషయాలు మరో ప్రాంతం వారికి భిన్నంగా కనిపించవచ్చని, అందుకే పరస్పర గౌరవం అవసరమని అభిప్రాయపడ్డారు.నిర్మాణాత్మక విమర్శలను ఎప్పుడూ స్వాగతిస్తామని, కానీ సాంస్కృతిక ఆధిపత్య ధోరణిని అంగీకరించలేమని స్పష్టం చేశారు. అవకాశాలు ఇచ్చిన పరిశ్రమను నటీనటులు కూడా గౌరవించాలని ఎస్‌కేఎన్ తన వ్యాఖ్యల ద్వారా సూచించారు. రాధికా ఆప్టే వ్యాఖ్యలను ఖండిస్తూ ఎస్‌కేఎన్ చేసిన పోస్టుకు కొందరు తెలుగు సినీ అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను బయటకు తీసుకొచ్చి ఆయన్ను కూడా విమర్శిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలీవుడ్ హీరోకు బెదిరింపు కాల్స్.. కోట్లు డిమాండ్ చూస్తూ ధమ్కీ
బాలు ప్యాంటుకి 2nd వరల్డ్ వార్‌కి లింకేటో తెలుసా? ఇట్రెస్టింగ్ విషయాన్ని చెప్పిన రేణు దేశాయ్
ప్యాసింజర్ లగేజ్ చెక్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్
మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?
హాస్టల్ గదుల్లో నాగుపాములు, తేళ్లు..విద్యార్థినులను కరిచిన ఎలుకలు
డైరెక్టర్ అవుదామనుకున్నాడు.. కట్ చేస్తే దొంగయ్యాడు!
గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఇక ఓటీపీతో పని లేదు!
ఆ ఇల్లే ఒక పాముల పుట్ట.. అడుగడుగునా పాము గుడ్లే!
చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!

