బాలు ప్యాంటుకి 2nd వరల్డ్ వార్కి లింకేటో తెలుసా? ఇట్రెస్టింగ్ విషయాన్ని చెప్పిన రేణు దేశాయ్
పవన్ కల్యాణ్ ‘బాలు’ సినిమాలో ధరించిన ప్రత్యేకమైన ప్యాంట్ల వెనుక ఆసక్తికర కథను రేణు దేశాయ్ వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి అరుదైన క్లాత్‌తో ఇటలీకి చెందిన కాస్ట్యూమ్ డిజైనర్ వాటిని రూపొందించినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అలాంటివి ఐదు మాత్రమే తయారయ్యాయని, వాటిలో ఒకటి పవన్ కోసం తీసుకున్నామని వివరించారు. అప్పట్లో ఆ ఒక్క ప్యాంటు ధర రూ.75 వేలని ఆమె తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. అందులో బాలు సినిమాకి ఒక సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉందనే చెప్పాలి. అప్పట్లో ఈ మూవీకి విపరీతమైన క్రేజ్. అంతేకాదు ఇందులోని సాంగ్స్, పవన్ కళ్యాణ్ మేనరిజం, స్టైల్ అప్పట్లో సెన్సేషనల్ అయ్యాయి. అందులోనూ బాలు ప్యాంట్ కోసం యూత్ పోటీ పడేవారు. ఈ ప్యాంటు వేసుకుని పవర్ స్టార్లా ఫోజ్లిచ్చేవారు. అయితే ఈ ప్యాంట్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీని.. దాని రేట్‌ను.. హీరోయిన్ రేణు దేశాయ్, రీసెంట్గా మరో సారి చెప్పుకొచ్చారు. అప్పట్లో బాలు సినిమాకు.. కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసిన రేణు దేశాయ్.. బాలు సినిమాలోని ఘనీ పాత్ర కోసం చాలా కష్టపడి సపరేట్గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశామంటూ చెప్పుకొచ్చారు. అందులోనూ పవన్ కళ్యాణ్ ధరించిన ప్యాంట్లు మామూలువి కావని.. అవి రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి నిజమైన బట్టతో ప్రత్యేకంగా తయారు చేశామంటూ చెప్పుకొచ్చారు. ఆ ప్యాంటు తయారీకి వాడిన క్లాత్.. అరుదైనది కావడంతో, ప్యాంట్లను తయారు చేయించడానికి అడ్వాన్స్ చెల్లించి, మూడు నెలల తర్వాత వాటిని తీసుకోవాల్సి వచ్చిందని రేణు దేశాయ్ వివరించారు. ఇటలికీ చెందిన ప్రముఖ హాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ చేతుల మీదుగా ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్యాంట్ ను డిజైన్ చేయించానని ఆమె రివీల్ చేశారు. అప్పట్లో అలాంటి ప్యాంట్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు మాత్రమే తయారు చేశారని.. వాటిలో ఒకటి ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డేవిడ్ బెక్కంకి వెళ్లిందని, ఒకటి పవన్ కళ్యాణ్ కోసం తీసుకున్నామని ఆమె చెప్పుకొచ్చారు. ఈ అరుదైన , ప్యాంట్ల ధర ఆ టైంలో రూ. 75,000 ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో ఇంత పెద్ద మొత్తం పెట్టి ఒక ప్యాంటు కొనడం సాధారణ విషయం కాదని, ఇది సినిమాపై , పాత్రపై మేకర్స్ చూపిన అంకితభావాన్ని తెలియజేస్తుందని రేణు దేశాయ్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ సినిమాకు అంత భారీ మొత్తాన్ని భరించడానికి చిత్ర నిర్మాత అశ్వినీదత్ సిద్దంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ నిరాకరించి తన సొంత ఖర్చులతోనే దానిని రూపొందించుకున్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్యాసింజర్ లగేజ్ చెక్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్
మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?
హాస్టల్ గదుల్లో నాగుపాములు, తేళ్లు..విద్యార్థినులను కరిచిన ఎలుకలు
డైరెక్టర్ అవుదామనుకున్నాడు.. కట్ చేస్తే దొంగయ్యాడు!
గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఇక ఓటీపీతో పని లేదు!
ఆ ఇల్లే ఒక పాముల పుట్ట.. అడుగడుగునా పాము గుడ్లే!
చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!

