AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా కడపు నిండుతోంది కేసీఆర్‌ సార్‌ వల్లే.. జబర్దస్త్‌ కమెడియన్ ఎమోషనల్

నా కడపు నిండుతోంది కేసీఆర్‌ సార్‌ వల్లే.. జబర్దస్త్‌ కమెడియన్ ఎమోషనల్

Phani CH
|

Updated on: Nov 07, 2026 | 6:59 PM

Share

జబర్దస్త్‌లో తాగుబోతు పాత్రలతో నవ్వించిన కమెడియన్‌ రాజమౌళి ప్రస్తుతం తెలంగాణ సాంస్కృతిక శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు కల్పించిన కేసీఆర్‌ వల్లే తనకు ఈ అవకాశం వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంగా చెప్పారు. కరోనా సమయంలో టీవీ షోలు, ఈవెంట్లు ఆగిపోయినా ప్రభుత్వ ఉద్యోగమే తన కుటుంబానికి అండగా నిలిచిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆట, పాటలతో ప్రభుత్వ కార్యక్రమాలు, సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

జబర్దస్త్‌ తో ఎంతో మందికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ షోలో సత్తా చాటిన ఎంతో మంది ఆర్టిస్టులు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. హీరోలుగా, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా, కమెడియన్లుగా, సహాయక నటులుగా రాణిస్తున్నారు. అదే సమయంలో ఒకప్పుడు ఇదే జబర్దస్త్ లో తమ కామెడీతో నవ్వించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కొందరు నటులు.. ఆ తర్వాత సరైన అవకాశాలు లేక వేర్వేరు పనులు చేసుకుంటున్నారు. కొందరు యూట్యూబ్ ఛానెళ్లు, ఈవెంట్లతో ఫ్యామిలీని పోషించుకుంటున్నారు. మరికొందరు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే మొన్నటివరకు ఇదే జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చకున్న ఒకరు ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తన ట్యాలెంట్ కు తగ్గట్టుగానే తెలంగాణ సాంస్కృతిక శాఖలో కళాకారుడిగా పని చేస్తున్నారు. ఉద్యోగ నిర్వహణలో భాగంగా సీజనల్ వ్యాధులు, ప్రభుత్వ కార్యక్రమాలు, అవగాహన సదస్సులను తన ఆట, పాటల రూపంలో జనాలకు తెలియజేస్తున్నారు. అతనెవరో కాదు రాజమౌళి. జబర్దస్త్ లో తాగుబోతు పాత్రలతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన రాజమౌళి. రాకెట్ రాఘవ, చమ్మక్ చంద్ర, బుల్లెట్ భాస్కర్ స్కిట్స్‌లో కనిపించేవాడు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తూ.. జబర్దస్త్‌ వేదికపై కనిపించడం మానేశాడు మౌళి. అయితే రీసెంట్‌గా పలు ఛాన్సెలో ఇంటర్వ్యూలిస్తూ కనిపించిన మౌళి.. ఓ ఇంటర్వ్యూలో.. తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడానికి కేసీఆరే కారణంగా అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగం నాకు సెంటిమెంట్. తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో పని చేసిన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా కళాకారుడిని గుర్తించలేదు. కానీ ఉద్యోగభృతిని కల్పించి గౌరవస్థానాన్ని కల్పించిన ప్రజా ప్రతినిధి కేవలం ఒక్క కేసీఆర్ మాత్రమే. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు రాజమౌళి. కేసీఆర్‌ వల్లే తనకు కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చెప్పుకొచ్చాడు. గవర్నమెంట్ జాబ్ అంటే ప్రతి ఒక్కరి కల. ఫిక్స్‌డ్‌ సాలరీ ఉంటది కదా అనే ఉద్దేశ్యంతో తన భార్య సలహా మేరకు ప్రభుత్వ ఉద్యోగంలో చేరానంటూ మౌళి చెప్పుకొచ్చాడు. కరోనా టైంలో టీవీ షోలు, ఈవెంట్లు అన్నీ ఆగిపోయాయి. ఆ సమయంలో తనకున్న ప్రభుత్వ ఉద్యోగమే తనను కాపాడి.. కడుపు నింపిందన్నాడు మౌళి. ప్రస్తుతం తాను తెలంగాణ సాంస్కృతిక శాఖలో కళాకారుడిగా పని చేస్తున్నానని.. సీజనల్ వ్యాధులు, ప్రభుత్వ కార్యక్రమాలు, అవగాహన సదస్సులను పాట, ఆట రూపంలో ప్రజలకు తెలియజేస్తున్నా అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. సమాజానికి ఉపయోగపడే ఉద్యోగం మాది. ప్రభుత్వం చేసే మంచి పనుల్ని ప్రజలకు తెలియజేస్తాం అంటూ రాజమౌళి ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ జబర్దస్త్ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కెరీర్ ఇచ్చిన ఇండస్ట్రీ మీద నిందలు వేస్తావా.. రాధికకు పాయల్ స్ట్రాంగ్ కౌంటర్

Follow Us