నాకు తెలిసిన అతను స్వార్థపరుడు.. ముఖేష్ ఆటపై జగతి షాకింగ్ రివ్యూ..
బిగ్‌బాస్ హౌస్‌లో ముఖేష్ ఆటతీరుపై వస్తున్న విమర్శల గురించి నటి జ్యోతి పూర్వజ్ స్పందించారు. ముఖేష్ తనకు వ్యక్తిగతంగా బాగా తెలుసని, మూడేళ్ల పాటు కలిసి పనిచేశామని చెప్పారు. కెరీర్, ఫిట్‌నెస్, కుటుంబ బాధ్యతలపై ఎప్పుడూ శ్రద్ధ పెట్టేవాడని గుర్తుచేసుకున్నారు. అయితే బిగ్‌బాస్‌లో ఇతరుల ఆట బాగుండాలని కోరుకుంటున్నాడనే వార్తలు తనను ఆశ్చర్యపరిచాయని తెలిపారు. గత కొన్నేళ్లలో అతనిలో మార్పు వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
నటి జ్యోతి పూర్వజ్! తన రీసెంట్ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్‌లో ముఖేష్ పై వస్తున్న విమర్శల పై, మనోడి ఆట తీరుపై ఈమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు .ముఖేష్ తనకు వ్యక్తిగతంగా బాగా తెలుసని చెప్పిన జ్యోతి.. అతను ఎలాంటివారో, ఎలా ప్రవర్తిస్తారో తనకు బాగా తెలుసని, కేవలం షోలో చూసి దాని ఆధారంగా వారిని అంచనా వేయడం సరికాదని చెప్పుకొచ్చారు. ముఖేష్ హౌస్ లో 90 రోజులు ఉంటే, నేను మూడు సంవత్సరాలు వారితో కలిసి పని చేశానని.. ముఖేష్ వ్యక్తిత్వాన్ని వివరించారు జ్యోతి. అతను అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడని.. తన కెరీర్‌పై పూర్తి శ్రద్ధ చూపుతాడని జ్యోతి పూర్వజ్ అన్నారు. నటుడిగా ఎదగాలని, మంచి పేరు సంపాదించుకోవాలని ముఖేష్ నిరంతరం కృషి చేస్తాడని చెప్పారు. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి కృషి చేస్తాడని, జిమ్నాస్టిక్ కూడా నేర్చుకున్నాడని గుర్తు చేసుకున్నారు. ముఖేష్ చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి అని, తల్లిదండ్రులు, సోదరి అంటే అతనికి ఎంతో ఇష్టమని, వారి బాధ్యతలను ఎప్పుడూ మర్చిపోడు అని అన్నారు. తన ఇంటి బాధ్యతల గురించి, భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచిస్తాడని, ఎవరికీ ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాడని జ్యోతి చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రస్తుతం బిగ్ బాస్‌లో ముఖేష్ ప్రవర్తన తనను ఆశ్చర్యానికి గురిచేసిందని జ్యోతి పూర్వజ్ అన్నారు. తనకు తెలిసిన ముఖేష్ తన ఎదుగుదల విషయంలో కొంచెం స్వార్థపరుడని, “నేను ఎదగాలి, నాకు మంచి పేరు రావాలి, అందరూ నన్ను ఇష్టపడాలి” అని కోరుకుంటాడని అన్నారు. అయితే, బిగ్ బాస్‌లో అతను పక్కన వాళ్ళు బాగుండాలి, వారి ఆట బాగుండాలి అని ఫీల్ అవుతున్నట్లు తనకు వార్తలు వస్తున్నాయని, ఇది తనకు షాకింగ్‌గా ఉందని చెప్పారు. బహుశా ఈ మూడు, నాలుగు సంవత్సరాలలో అతను మారి ఉండవచ్చని, లేదా బయటి నుంచి ఎవరైనా అతనిని బాగా ప్రభావితం చేసి ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. తాను బిగ్ బాస్ సిరీస్‌ను చూడకపోయినా, వింటున్న విషయాలు మాత్రం తనకు కొత్తగా ఉన్నాయని జ్యోతి పూర్వజ్ అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సౌత్ హీరోయిన్లు అంటే చిన్నచూపా.. మీరేమన్నా తోపులా..
ఆ స్టార్ హీరో చేసిన చెడ్డ అలవాటు.. ఈ నటుడినే బలితీసుకుంది!
భర్తకు తగ్గ భార్య.. ఏకంగా సూర్యకే 3 సార్లు నో చెప్పిందట!
మహేష్‌కు పాట పాడడమే.. నా జీవితంలో అతిపెద్ద తప్పు!
నా కడపు నిండుతోంది కేసీఆర్ సార్ వల్లే.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్
ప్యాసింజర్ లగేజ్ చెక్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్
మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?
హాస్టల్ గదుల్లో నాగుపాములు, తేళ్లు..విద్యార్థినులను కరిచిన ఎలుకలు
డైరెక్టర్ అవుదామనుకున్నాడు.. కట్ చేస్తే దొంగయ్యాడు!
గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఇక ఓటీపీతో పని లేదు!
ఆ ఇల్లే ఒక పాముల పుట్ట.. అడుగడుగునా పాము గుడ్లే!
చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!

