AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్‌ హీరో చేసిన చెడ్డ అలవాటు.. ఈ నటుడినే బలితీసుకుంది!

ఆ స్టార్‌ హీరో చేసిన చెడ్డ అలవాటు.. ఈ నటుడినే బలితీసుకుంది!

Phani CH
|

Updated on: Nov 07, 2026 | 7:06 PM

Share

90ల ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన నటుడు రఘువరన్‌ తన విలక్షణమైన నటన, గంభీరమైన గొంతుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘శివ’, ‘బాషా’, ‘సుస్వాగతం’, ‘ఒకే ఒక్కడు’ వంటి సినిమాల్లో ఆయన పాత్రలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే వ్యక్తిగత జీవితంలోని ఒత్తిళ్లు, మద్యపాన వ్యసనం ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. ఓ హిందీ సినిమా షూటింగ్‌లో స్టార్‌ హీరో తనను మద్యానికి అలవాటు చేశాడని గతంలో చెప్పిన రఘువరన్‌, ఆ హీరో పేరు మాత్రం వెల్లడించలేదు.

రఘువరన్‌.. ఈ తరం జనరేషన్ కు ఈ నటుడి గురించి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ 90’s ఆడియెన్స్ లో చాలా మందికి ఈయన ఫేవరెట్ యాక్టర్. తనదైన నటనతో ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రఘువరన్. విలన్‌గా, సహాయక నటుడిగా వందలాది సినిమాల్లో నటించి మెప్పించారాయన. నాగార్జున శివ సినిమాలో భవానీ.. బాషా సినిమాలో ఆంటోనీ.. సుస్వాగతం సినిమాలో పవన్‌ కల్యాణ్‌ తండ్రి, ఒకే ఒక్కడు సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర.. ఇలా రఘువరన్ ఫిల్మోగ్రఫీ చూస్తే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. కేవలం నటనతోనే కాదు తన గంభీరమైన గొంతుతోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు రఘువరన్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 200కు పైగా సినిమాలు చేశారీ నటుడు. తన నటన ప్రతిభకు ప్రతీకగా ఎన్నో అవార్డులు, ప్రశంసలు పొందారు. మద్యపాన వ్యసనం కారణంగానే రఘువరన్ కన్నుమూశారు. సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే వ్యక్తిగత జీవితంలోని ఒత్తిళ్ల కారణంగా ఆయన ఆల్కహాల్ కు బాగా బానిసయ్యారు. ఈ వ్యసనాల కారణంగా ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. అనేక సార్లు ఆస్పత్రి పాలయ్యారు కూడా. అయితే ఒక హిందీ సినిమా షూటింగ్ టైమ్ లో ఒక స్టార్ హీరో వద్దన్నా వినకుండా తనను మత్తుకు బానిస చేశాడని రఘువరన్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఈ మద్యం అలవాట్లే తన కెరీర్‌పై, కుటుంబ జీవితంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని వాపోయారు. అయితే ఆ స్టార్ హీరో పేరు మాత్రం బయటకు చెప్పలేదు రఘువరన్. రఘువరన్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ప్రముఖ నటి రోహిణీని 1996లో వివాహం చేసుకున్నారు. వీరికి 2000లో వరుణ్‌ రిషి అనే బాబు జన్మించాడు. అయితే కొన్ని కారణాలతో 2004లో విడాకులు తీసుకున్నారు రోహిణీ- రఘువరన్‌. ఇక పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లోనూ రఘువరన్ కు బాగా ఎదురు దెబ్బలు తగిలాయి. దీంతో ఆయన మద్యపానానికి అలవాటు పడ్డారు. విపరీతంగా ఆల్కహాల్ సేవించడంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యారీ వర్సటైల్ యాక్టర్. చివరకు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ తో 2008 మార్చి 19న కన్నుమూశారు రఘువరన్. ప్రస్తుతం మన మధ్యన లేకపోయినా తన సినిమాల రూపంలో ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోయారు రఘువరన్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భర్తకు తగ్గ భార్య.. ఏకంగా సూర్యకే 3 సార్లు నో చెప్పిందట!

మహేష్‌కు పాట పాడడమే.. నా జీవితంలో అతిపెద్ద తప్పు!

నా కడపు నిండుతోంది కేసీఆర్‌ సార్‌ వల్లే.. జబర్దస్త్‌ కమెడియన్ ఎమోషనల్

కెరీర్ ఇచ్చిన ఇండస్ట్రీ మీద నిందలు వేస్తావా.. రాధికకు పాయల్ స్ట్రాంగ్ కౌంటర్

Follow Us