Maruti Suzuki Offers: మారుతి సుజుకి బంపర్ ఆఫర్.. 3 లక్షల వరకు తగ్గింపు..!
Maruti Suzuki Offers: మారుతి సుజుకి భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల కంపెనీలలో ఒకటి. ఆ కార్లు భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందాయి. మారుతి తన నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించే అన్ని కార్లు, ఎస్‌యూవీలలో, గ్రాండ్ విటారాలపై దివాళి ఆఫర్‌లను..

Maruti Suzuki Offers: మారుతి సుజుకి భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల కంపెనీలలో ఒకటి. ఆ కార్లు భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందాయి. మారుతి తన నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించే అన్ని కార్లు, ఎస్‌యూవీలలో, గ్రాండ్ విటారాలపై దివాళి ఆఫర్‌లను ప్రకటించింది. బడ్జెట్ కార్లను ఎక్కువగా ఉత్పత్తి చేసే మారుతి సుజుకి, తన నెక్సా శ్రేణి కార్లపై తగ్గింపులను ప్రకటించింది. అయితే ఈ తగ్గింపు నవంబర్ 30 వరకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి ఏ కారుపై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం.
1. మారుతి ఫ్రాంక్స్ – రూ. 27,100
2. మారుతి గ్రాండ్ విటారా – రూ. 3 లక్షలు
3. మారుతి XL6 – రూ. 61 వేలు
4. మారుతి జిమ్నీ – రూ. 35 వేలు
5. మారుతి ఇ-విటారా – రూ. 50 వేలు
6. మారుతీ ఇన్విక్టో – రూ.95 వేలు
1. మారుతి ఫ్రాంక్స్:
మారుతి అత్యంత ప్రజాదరణ పొందిన కారు. మారుతి ఫ్రాంక్స్, మొత్తం రూ. 27,100కే అందుబాటులో ఉంది. ఈ కారుపై రూ. 5,000 నగదు తగ్గింపును ప్రకటించారు. రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10,000 స్క్రాపేజ్ డిస్కౌంట్‌ను కూడా ప్రకటించారు. ఈ కారు ప్రారంభ ధర రూ. 6,89,900 (ఎక్స్-షోరూమ్).
2. మారుతి గ్రాండ్ విటారా:
ఎక్స్-షోరూమ్ ధర రూ. 10,76,500 నుండి ప్రారంభమయ్యే గ్రాండ్ విటారా, నెక్సా లైనప్‌లోనే అత్యధిక ప్రయోజనాలను అందిస్తుంది. మారుతి సుజుకి జీరో రోడ్ టాక్స్ ఆఫర్‌ను అందిస్తోంది. దీని ద్వారా రూ. 1.85 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే, రూ. 50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ. 45,000 స్క్రాపేజ్ బోనస్, ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ. 25,000 PCM బోనస్, రూ. 30,000 వరకు లాయల్టీ బోనస్, రూ. 15,000 కార్పొరేట్ బోనస్ కూడా లభిస్తున్నాయి. కంపెనీ కాంప్లిమెంటరీగా ఐదేళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీని కూడా అందిస్తోంది. కొన్ని కాన్ఫిగరేషన్లలో నవంబర్ 6వ తేదీలోపు కారును బుక్ చేసుకునే కస్టమర్లు రూ. 11,000 అదనపు క్యాష్ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. మొత్తంగా కస్టమర్లు రూ. 3 లక్షలకు పైగా ఆదా చేసుకోవచ్చు.
3. మారుతి XL6:
ఈ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ. 11,62,300. ఈ కారు కోసం మొత్తం రూ. 61,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 11,000 అదనపు నగదు తగ్గింపు, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.15,000 స్క్రాపేజ్ బోనస్‌గా కూడా ప్రకటించింది కంపెనీ.
4. మారుతి జిమ్నీ:
మారుతి ఆఫ్-రోడ్ కారు అయిన మారుతి జిమ్నీపై మొత్తం రూ. 35,000 తగ్గింపును ప్రకటించారు. ఈ కారు ప్రారంభ ధర రూ. 12,59,000. ఈ కారుపై రూ. 35,000 నగదు తగ్గింపును ప్రకటించారు.
5. మారుతి, విటారా:
మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు మారుతి ఇ విటారాపై రూ. 50,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 16,19,000, రూ. 30,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను ప్రకటించారు.
6. ఇన్విక్టో:
మారుతి సుజుకి అత్యంత ప్రసిద్ధ లగ్జరీ కారు అయిన ఇన్విక్టో ప్రారంభ ధర రూ. 25 లక్షల 2 వేల 400. ఈ కారు మొత్తం ధర రూ.95 వేలు. ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 50 వేలు. స్క్రాపేజ్ బోనస్ రూ. 50 వేలు. లాయల్టీ బోనస్ రూ. 30 వేలు. కార్పొరేట్ బోనస్ రూ. 15 వేలు.
ఇది కూడా చదవండి: Concrete Mix: ఇంటి నిర్మాణ సమయంలో మిల్లర్‌లో కాంక్రీట్‌ను ఎంతసేపు మిక్స్ చేయాలి?
ఇది కూడా చదవండి: Cheque Book: డిసెంబర్ 31 తర్వాత పాత చెక్ బుక్కులు పని చేయవా..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




