AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ టీమ్‌ ఏం చేశారంటే..

Trending: గోవాలోని సముద్ర తీరంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మాండ్రెమ్ బీచ్‌కు ఓ తిమింగలం కొట్టుకొచ్చింది. సముద్రంలో స్వేచ్ఛగా తిరగాల్సిన ఈ భారీ సముద్ర జీవి ఒక్కసారిగా ఒడ్డుకు చేరడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది..

Trending: గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ టీమ్‌ ఏం చేశారంటే..
Whale
Subhash Goud
|

Updated on: Nov 09, 2026 | 9:50 AM

Share

Trending: గోవాలోని ఒక బీచ్‌కు కొట్టుకొచ్చిన తిమింగలాన్ని ఆదివారం రక్షించి, స్వచ్ఛంద సేవకులు దానిని సముద్ర జలాల్లోకి విడిచిపెట్టారు. మధ్యాహ్నం గోవాలోని మాండ్రేమ్ బీచ్‌లో ఒక సముద్ర క్షీరదం కనిపించింది. దానిని గుర్తించిన వెంటనే, జల రక్షణ సేవల సంస్థ అయిన దృష్టి లైఫ్‌సేవర్ గ్రూప్‌కు చెందిన వాలంటీర్లు దానిని రక్షించేందుకు తక్షణమే ప్రయత్నాలు ప్రారంభించారు.

రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలలో వాలంటీర్ల బృందం చిన్నగా ఉన్న తిమింగలాన్ని పెద్ద గుడ్డ ముక్కలలో చుట్టి, సముద్రానికి దగ్గరగా లాగుతున్నట్లు కనిపిస్తుంది. దానిని సురక్షితంగా ఉంచడాని దానిపై నీళ్లు చల్లుతూ సముద్రంలోకి విడిచిపెట్టారు.

ఈ సహాయక చర్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తిమింగలాన్ని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది పడిన శ్రమను వీడియోలో చూడవచ్చు. సముద్ర జీవులను రక్షించడంలో శిక్షణ పొందిన దృష్టి లైఫ్‌సేవర్ గ్రూప్ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించారు.

గతంలో ముంబైలో చనిపోయిన హంప్‌బ్యాక్ తిమింగలం

కొన్ని నెలల క్రితం ముంబైలోని బాంద్రా తీరంలో సుమారు 26 అడుగుల పొడవున్న హంప్‌బ్యాక్ తిమింగలం పిల్ల ఒడ్డుకు కొట్టుకొచ్చింది. దానిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు నిలబెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో గోవాలో తిమింగలాన్ని సురక్షితంగా సముద్రంలోకి పంపించడం ఊరటనిచ్చే విషయంగా నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి
చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?
దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు
దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు
కళ్లముందే కుప్పకూలిన మనిషి.. చుట్టూ జనం ఉన్నా దక్కని సాయం..
కళ్లముందే కుప్పకూలిన మనిషి.. చుట్టూ జనం ఉన్నా దక్కని సాయం..
అరుదైన ఘనత.. ముఖంపై మచ్చ లేకుండానే పుర్రె అడుగున కణితి తొలగింపు!
అరుదైన ఘనత.. ముఖంపై మచ్చ లేకుండానే పుర్రె అడుగున కణితి తొలగింపు!
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?
కూర అవసరమే లేదు ఈ చారు చేస్తే.. కడుపు నిండుగా తింటారు!
కూర అవసరమే లేదు ఈ చారు చేస్తే.. కడుపు నిండుగా తింటారు!
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..