AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Concrete Mix: ఇంటి నిర్మాణ సమయంలో మిల్లర్‌లో కాంక్రీట్‌ను ఎంతసేపు మిక్స్ చేయాలి?

House Construction Concrete Mix: కాంక్రీట్‌ను అధికంగా మిక్స్ చేయడం కూడా హానికరం. మూడు నుండి నాలుగు నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు మిక్స్ చేస్తే, కాంక్రీట్‌లో ఉపయోగించే కంకర ముక్కలు ఒకదానికొకటి ఢీకొని పొడిలాగా మారిపోతాయి. ఈ ప్రక్రియ వల్ల మిశ్రమంలోని నీరు ..

Concrete Mix: ఇంటి నిర్మాణ సమయంలో మిల్లర్‌లో కాంక్రీట్‌ను ఎంతసేపు మిక్స్ చేయాలి?
House Construction Concrete Mix
Subhash Goud
|

Updated on: Nov 09, 2026 | 12:37 PM

Share

House Construction Concrete Mix: నిర్మాణ పనులలో కాంక్రీట్ నాణ్యతకు సరైన మిక్సింగ్ చాలా అవసరం. సిమెంట్, ఇసుక, 20mm కంకర, నీటిని కలపడానికి కన్స్ట్రక్షన్ సైట్లలో మిల్లర్‌లను విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే, ఈ మిల్లర్‌లలో కాంక్రీట్‌ను ఎంతసేపు మిక్స్ చేయాలి అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. సరైన మిక్సింగ్ సమయం, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

సాధారణంగా మిల్లర్‌లు నిమిషానికి 20 రౌండ్లు (20 RPM) తిరుగుతాయి. పని త్వరగా పూర్తి చేయాలనే తొందరలో మెటీరియల్‌ను సరిగా మిక్స్ చేయకుండానే బయటికి తీసేస్తే, కాంక్రీట్ మిశ్రమం అసమానంగా ఉంటుంది. దీనివల్ల కాంక్రీట్ బలం తగ్గుతుంది. కాంక్రీట్ సమర్థవంతంగా, ఏకరీతిగా మిక్స్ అవ్వాలంటే కనీసం 2 నుండి 3 నిమిషాల పాటు మిల్లర్‌లో తిప్పాలి. ఈ సమయంలో మిల్లర్‌లోని డ్రమ్ సుమారు 30 సార్లు తిరుగుతుంది. ఇది మెటీరియల్స్ అన్నింటినీ పూర్తిగా కలిసేలా చేస్తుంది.

అదే సమయంలో కాంక్రీట్‌ను అధికంగా మిక్స్ చేయడం కూడా హానికరం. మూడు నుండి నాలుగు నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు మిక్స్ చేస్తే, కాంక్రీట్‌లో ఉపయోగించే కంకర ముక్కలు ఒకదానికొకటి ఢీకొని పొడిలాగా మారిపోతాయి. ఈ ప్రక్రియ వల్ల మిశ్రమంలోని నీరు ఆవిరైపోతుంది. ఫలితంగా “సెగ్రిగేషన్” జరుగుతుంది. సెగ్రిగేషన్ అంటే కాంక్రీట్ మిశ్రమంలోని భారీ పదార్థాలు (కంకర) కిందికి చేరుకోవడం, తేలికపాటి పదార్థాలు (సిమెంట్ పేస్ట్) పైకి తేలడం. ఇలాంటి కాంక్రీట్ నిర్మాణంకు సరైన బలాన్ని ఇవ్వదు. అందుకే కాంక్రీట్ నాణ్యతను కాపాడటానికి 2-3 నిమిషాల సరైన మిక్సింగ్ సమయాన్ని పాటించడం అత్యవసరం.

ఇది కూడా చదవండి: Cheque Book: డిసెంబర్ 31 తర్వాత పాత చెక్ బుక్కులు పని చేయవా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us