AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సామాన్యులకు పిడుగులాంటి వార్త.. డిసెంబర్ 1 నుంచి పెరగనున్న ధరలు.. ఇవి మరింత ఖరీదు..

New Rules: డిసెంబర్ 1 నుండి ఆర్థిక రంగంలో పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కార్ల నుండి గృహోపకరణాల వరకు కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. అలాగే క్రెడిట్ కార్డుల నుండి గ్యాస్ ధరల వరకు పెంపుదల, EMIల భారం పెరగనుంది. దీంతో ఈ మార్పుల గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరముంది.

సామాన్యులకు పిడుగులాంటి వార్త.. డిసెంబర్ 1 నుంచి పెరగనున్న ధరలు.. ఇవి మరింత ఖరీదు..
New Rules
Venkatrao Lella
|

Updated on: Nov 27, 2026 | 10:54 AM

Share

డిసెంబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఆర్ధికంగా ప్రభావితం చేసే పలు కీలక  మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజల జేబుకు చిల్లులు పడనున్నాయి. కార్ల నుండి గృహోపకరణాల వరకు.. క్రెడిట్ కార్డుల నుండి గ్యాస్, పెట్రోల్ ధరల వరకు పలు వస్తువులు, సేవల ధరలు ఒకేసారి భారీగా పెరగనున్నాయి.  కార్ల తయారీ కంపెనీలు ఇప్పటికే ధరలను పెంచడం ప్రారంభించాయి. మారుతి సుజుకి తమ మోడళ్ల ధరలను ఇటీవల పెంచగా.. హ్యుందాయ్, ఆడి వంటి కంపెనీలు కూడా డిసెంబర్ నుంచి ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి. దీంతో కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారిపై అదనపు భారం పడనుంది. అలాగే క్రెడిట్ కార్డుల వినియోగదారులకు కూడా షాక్ తగిలింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డులు ఉపయోగించి చేసే ట్రావెల్, పెట్రోల్ కొనుగోళ్లపై ఒక శాతం సర్‌ఛార్జి విధించనున్నారు. రూ.30 వేలు దాటి చేసే ట్రాన్సాక్షన్లకు అదనంగా డిసెంబర్ 1 నుండి ఒక శాతం సర్‌ఛార్జి విధించనున్నారు.

ఇక సామాన్య ప్రజలపై ప్రభావం చూసేవవాటిల్లో ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపు ముఖ్యమైంది. ప్రొపేన్, బ్యూటేన్ వంటి ముడి పదార్థాల ధరలు మెట్రిక్ టన్‌కు 620 డాలర్ల నుండి 750 డాలర్లకు పెరిగాయి. దీని ప్రభావంతో వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగే అవకాశముంది. ఇప్పటికే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధఱ రూ.2,800కి చేరుకుంది. అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం, చమురు కంపెనీలు ఇస్తున్న సబ్సిడీ భారం అధికమవడం వల్ల ఈ పెంపు అనివార్యం కావచ్చని అంటున్నారు. అలాగే అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణమవుతున్నాయి. అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల నుండి 106-108 డాలర్లకు చేరుకుననాయి. దీని తోడు ఎల్‌నివో ప్రభావంతో ఆహార ఉత్పత్తి తగ్గిపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ఆర్ధిక రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే వడ్డీ రేట్లను పెంచేందుకు సిద్దమవుతున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది.  భారతదేశంలో కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. ఫలితంగా ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను పెంచిదే గృహ రుణాలు, వాహన రుణాల ఈఎంఐలు పెరగడం వల్ల సామాన్యులపై అదనపు భారం పడనుంది. మరోవైపు బంగారం, వెండి ధరలు ఈ ఏడాదిలో నమోదైన ఆట్ టైం రికార్డ్ ధరలో పోలిస్తే 20-30 శఆతం వరకు తగ్గాయి. రియల్ ఎస్టేట్ ధరలు కూడా స్థిరంగా ఉండటమో లేదా తగ్గడమో జరుగుతోంది. స్టాక్ మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి. నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ 40 నుంచి 50 శాతం పడిపోాయాయి. ఈ పరిస్థితి 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని తలపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే