AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Raju: ఆ హీరోను నేను నాన్న అని పిలుస్తాను.. నన్ను అన్నా అని పిలుస్తాడు.. నిర్మాత దిల్ రాజు..

ప్రొడ్యుసర్ దిల్ రాజు తన సినీ ప్రస్థానం గురించి వెల్లడించారు. అలాగే టాలీవుడ్ హీరో గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ హీరోతో తనకున్న బాండింగ్ గురించి చెప్పుకొచ్చారు. అతడిని తాను నాన్న అని పిలుస్తానని.. అతడు తనను అన్నా అని పిలుస్తాడని అన్నారు.

Dil Raju: ఆ హీరోను నేను నాన్న అని పిలుస్తాను.. నన్ను అన్నా అని పిలుస్తాడు.. నిర్మాత దిల్ రాజు..
Dil Raju
Rajitha Chanti
|

Updated on: Nov 27, 2026 | 10:23 AM

Share

టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ ప్రయాణం, స్టార్ హీరోలతో తనకున్న అనుబంధం గురించి అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తో తమకు ఉన్న బాండింగ్ గురించి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనను తారక్ అన్న అని పిలుస్తారని, అయితే తాను మాత్రం ఎన్టీఆర్‌ను ముద్దుగా నాన్న అని పిలుస్తానని చెప్పారు. ఇప్పుడు దిల్ రాజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో తన సాన్నిహిత్యం ఎలా ఏర్పడిందనే విషయాన్ని వివరిస్తూ, తాను ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

ముఖ్యంగా బృందావనం సినిమా షూటింగ్ సమయంలో తారక్‌తో మరింత చనువు పెరిగిందని చెప్పారు. ఆ సమయంలో కొడాలి నానితో పాటు ఇతర సన్నిహితులు ఎన్టీఆర్‌తో కలిసి ఉండేవారని, వారందరూ తారక్‌ను నాన్న అని పిలుస్తుండటం చూసి తనకు కూడా ఆ పిలుపు ఎంతో ముద్దుగా, ఆత్మీయంగా అనిపించిందని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

ఇతరులు పిలుస్తున్న ఆ పిలుపు తనకూ నచ్చడంతో, తనకు కూడా ఆ అవకాశం ఉందనే చనువుతో అప్పటి నుంచే ఎన్టీఆర్‌ను నాన్న అని పిలవడం కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. పరస్పర గౌరవం, ఆప్యాయతతో సాగే ఈ బంధంలో తారక్ తనను అన్న అని పిలుస్తారని, తాను మాత్రం తారక్‌ను నాన్న అని సంబోధిస్తానని సరదాగా పంచుకున్నారు. ప్రస్తుతం దిల్ రాజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఇప్పుడు డ్రాగన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.

దిల్ రాజు, ఎన్టీఆర్..

Dil Raju, Jrntr

Dil Raju, Jrntr

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే