AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: బుమ్రా ఎంత చెప్పినా వినని శుభ్మన్ గిల్.. కట్‌చేస్తే.. రెండో టెస్ట్‌లో టీమిండియాకు బిగ్ లాస్.. ఏమైందంటే?

Shubman Gill DRS: న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేసిన పని చర్చనీయాంశంగా మారింది. జస్ప్రీత్ బుమ్రా సూచనను పట్టించుకోకుండా టామ్ బ్లండెల్‌పై డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. రీప్లేలో బంతి వికెట్లను తాకడం లేదని తేలడంతో భారత్ కీలకమైన రివ్యూను కోల్పోయింది.

Video: బుమ్రా ఎంత చెప్పినా వినని శుభ్మన్ గిల్.. కట్‌చేస్తే.. రెండో టెస్ట్‌లో టీమిండియాకు బిగ్ లాస్.. ఏమైందంటే?
Gill Drs
Venkata Chari
|

Updated on: Nov 27, 2026 | 10:20 AM

Share

Shubman Gill DRS: టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇచ్చిన సూచనను గిల్ పట్టించుకోలేదు. దీంతో భారత్ కీలకమైన డీఆర్‌ఎస్ (DRS) రివ్యూను కోల్పోయింది. వికెట్ వస్తుందన్న ఆశతో గిల్ తీసుకున్న నిర్ణయం చివరకు టీమిండియాకు నిరాశనే మిగిల్చింది.

బుమ్రా సూచించినా వినని గిల్.. వృథా అయిన రివ్యూ

క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ తొలి రోజు ఈ ఘటన చోటుచేసుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదటి సెషన్‌లో భారత బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. రెండో సెషన్‌లో పుంజుకున్నారు. ఆకాష్ దీప్ రెండు వికెట్లు తీయగా, అన్షుల్ కాంబోజ్ కూడా హెన్రీ నికోల్స్‌ను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో టీమిండియా ఆధిపత్యం పెరిగింది. ఈ క్రమంలో టీ విరామానికి ముందు మరో వికెట్ సాధించాలనే ఉద్దేశంతో గిల్.. జస్ప్రీత్ బుమ్రాను బౌలింగ్‌కు తీసుకొచ్చాడు.

ఎక్కువమంది చదివినది: SL A vs IND A: ఆ ఇద్దరు కలిసి కొంప ముంచేశారు.. అందుకే చిత్తుగా ఓడిపోయాం..: తిలక్ వర్మ

ఇన్నింగ్స్ 48వ ఓవర్‌లో బుమ్రా వేసిన బంతి బయట నుంచి లోపలికి దూసుకొచ్చింది. బ్యాటర్ టామ్ బ్లండెల్ ఆ బంతిని ఆడటంలో విఫలమవడంతో అది నేరుగా అతడి ప్యాడ్లకు తగిలింది. భారత ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ పాల్ రీఫెల్ నాటౌట్‌గా ప్రకటించాడు.

బంతి వికెట్లపైకి వెళ్లదన్న బుమ్రా..

అంపైర్ నిర్ణయంపై సందేహం రావడంతో గిల్ బుమ్రాను సంప్రదించాడు. అయితే బంతి వికెట్లను తాకే అవకాశం లేదని, ఎత్తుగా వెళ్తుందని బుమ్రా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

కానీ చుట్టుపక్కల నుంచి వచ్చిన మరో సూచనతో గిల్ చివరి క్షణంలో డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. రీప్లేలో బంతి వికెట్లను తాకకుండా కొద్దిగా పైనుంచి వెళ్తున్నట్లు తేలింది. దీంతో భారత్ తన తొలి రివ్యూను కోల్పోయింది. బుమ్రా ముందుగానే చెప్పినప్పటికీ గిల్ రివ్యూ తీసుకోవడంతో ఈ ఘటన అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

వికెట్లు తీయకపోయినా బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్..

ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెషన్లలో బుమ్రాకు వికెట్ దక్కకపోయినా.. తన బౌలింగ్‌తో న్యూజిలాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. మరోవైపు తొలి ఓవర్‌లోనే లాథమ్‌ను ఎల్బీడబ్ల్యూగా బుమ్రా ఔట్ చేసినట్లు అంపైర్ ప్రకటించినా.. థర్డ్ అంపైర్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.

ఎక్కువమంది చదివినది: నువ్వు కెప్టెన్సీ మెటీరియల్ కాదు బ్రో .. బ్యాటర్‌గా, నాయకుడిగా అట్టర్ ఫ్లాప్.. తిలక్ వర్మపై ఫ్యాన్స్ ఫైర్..!

అనంతరం గర్నూర్ బ్రార్ తన తొలి టెస్టు వికెట్ సాధించగా, ఆకాష్ దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కాంబోజ్ బౌన్సర్‌కు హెన్రీ నికోల్స్ వికెట్ కోల్పోయాడు.

మొత్తానికి వికెట్ కోసం గిల్ తీసుకున్న తొందరపాటు నిర్ణయం భారత్‌కు ఒక డీఆర్‌ఎస్‌ను దూరం చేసింది. కెప్టెన్‌గా కీలక సమయాల్లో బౌలర్ల సూచనలను పరిగణనలోకి తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

ప్రస్తుతం ఆట పరిస్థితి..

74 ఓవర్లకు న్యూజిలాండ్ టీం 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. క్రీజులో బ్లండెల్ 38, ఫిలిప్స్ 24 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇక మిగతా బ్యాటర్లలో లాథం 59, కాన్వే 31, హెన్రి 16, రవీంద్ర 0, మిచెల్ 31 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ 2 వికెట్లు తీయగా, గుర్నూర్ బ్రార్, వాషింగ్టన్ సుందర్, కాంబోజ్ తలో వికెట్ పడగొట్టారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే