AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Netflix : ఆ సిరీస్ బ్యాన్ చేయకపోతే నెట్‌ఫ్లిక్స్ షూటింగ్‌లు బంద్.. సినీ కార్మిక సంఘం హెచ్చరిక!

భారతదేశంలో పాకిస్తానీ షో 'జో బచ్చే హై సంగ్ సమైత్ లో' వివాదం తీవ్రమైంది. నెట్‌ఫ్లిక్స్ మొట్టమొదటి పాకిస్తానీ ఒరిజినల్ అయిన ఈ సిరీస్ డిసెంబర్ 4న విడుదల కానుంది. అయితే ఈ సిరీస్ ఇండియాలో స్ట్రీమింగ్ కాకుండాదని.. వెంటనే బ్యాన్ చేయాలంటూ భారతదేశంలోని సినీ కార్మిక సంఘాలు నెట్ ఫ్లిక్స్ ను హెచ్చరించాయి.

Netflix : ఆ సిరీస్ బ్యాన్ చేయకపోతే నెట్‌ఫ్లిక్స్ షూటింగ్‌లు బంద్.. సినీ కార్మిక సంఘం హెచ్చరిక!
Jo Bachay Hain Sang Samait
Rajitha Chanti
|

Updated on: Nov 27, 2026 | 9:31 AM

Share

పాకిస్థాన్‌కు చెందిన తొలి నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ జో బచాయ్ హై సంగ్ సమైట్ లో (Jo Bachay Hain Sang Samait Lo) చుట్టూ ఇప్పుడు తీవ్ర వివాదం నెలకొంది. డిసెంబర్ 4న స్ట్రీమింగ్‌కు రానున్న ఈ సిరీస్‌ను భారత్‌లో విడుదల చేస్తే, నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్టులకు సహకరించబోమని, షూటింగ్‌లను నిలిపివేస్తామని సినీ కార్మిక సంఘం ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్, సనమ్ సయీద్, హనియా ఆమీర్ వంటి ప్రముఖ పాకిస్థానీ నటులు నటించిన ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైన వెంటనే భారత్‌లోని సినీ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ సిరీస్‌ను భారత్‌లో స్ట్రీమింగ్ చేస్తే నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్టుల షూటింగ్‌లు ఆగిపోయేలా చూస్తామని FWICE అధ్యక్షుడు బి.ఎన్. తివారీ స్పష్టం చేశారు. తమకు దేశమే ప్రథమమని, పాకిస్థానీ కళాకారుల కంటెంట్‌కు తాము వ్యతిరేకమని ఆయన తేల్చి చెప్పారు. ఒకవేళ ఆ ప్లాట్‌ఫామ్ తమ ఆదేశాలను పాటించకపోతే, అన్ని నెట్‌ఫ్లిక్స్ నిర్మాణాల నుండి తమ సభ్యులను ఉపసంహరించుకుంటామని, దాని లొకేషన్లలో షూటింగ్‌లను నిలిపివేస్తామని హెచ్చరించింది. భారతదేశంలో పనిచేస్తున్న అన్ని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు పాకిస్తానీ కంటెంట్‌ను ప్రదర్శించవద్దని గత సంవత్సరం ప్రభుత్వం ఆదేశించిందని భారతదేశ విధానాలకు లేదా జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే కంటెంట్‌ను ప్రదర్శించబోమని నెట్‌ఫ్లిక్స్ అంగీకరించిందని అన్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఒక పాకిస్తానీ సిరీస్ ప్రోమోను విడుదల చేసిందని.. ఈ సంస్థ నియంత్రణ అమెరికా నుండి ఉందని ప్రసారం అక్కడి నుండే జరుగుతుందని అందుకే.. హెచ్చరిస్తున్నామని.. భారతదేశంలోని ఏ మూల నుండి అయినా జరిగి ఉంటే, మేము దానిని ఇప్పటికి ఆపివేసేవాళ్ళమని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

” ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్‌తో మాకు మంచి సంబంధాలున్నాయి. వారు దీనిని ఆపకపోతే, ఎక్కడైతే వారి షూటింగ్ జరుగుతుందో, అక్కడి నుండి నేను మా సిబ్బందిని ఉపసంహరించుకుంటాను, ప్రతి ప్రదేశంలో వారి షూటింగ్ ఆగిపోతుంది” అని ఆయన అన్నారు. మరోవైపు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) కూడా ఈ సిరీస్‌ను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. భారత్‌లో పాకిస్థానీ కంటెంట్‌పై ఉన్న ఆంక్షలు, గత ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఏర్పడిన పరిణామాలను ప్రస్తావిస్తూ, డిసెంబర్ 4లోపు ఈ సిరీస్‌ను తొలగించకపోతే నిరసనలు, బాయ్‌కాట్ పిలుపులు ఇస్తామని తెలిపింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా ఈ అంశంపై స్పందిస్తూ పాకిస్థానీ కంటెంట్ నిషేధ అడ్వైజరీని గుర్తుచేసినట్లు సమాచారం.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

ఈ వివాదంపై పాకిస్థాన్ ప్రణాళికా శాఖ మంత్రి అహ్సన్ ఇక్బాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, కళలు, సంస్కృతిని రాజకీయాలకు వాడుకోవద్దని అన్నారు. ఓవైపు భారత్‌లో నిషేధ డిమాండ్లు, షూటింగ్‌ల బంద్ హెచ్చరికలు, మరోవైపు అంతర్జాతీయ వేదికపై చర్చల మధ్య జో బచాయ్ హై సంగ్ సమైట్ లో సిరీస్ భారత్‌లో స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనే అంశంపై నెట్‌ఫ్లిక్స్ ఇంకా అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. డిసెంబర్ 4 దగ్గర పడుతున్న కొద్దీ ఈ వివాదం మరింత ఆసక్తిగా మారుతోంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే