AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరణించిన వ్యక్తి నుంచి వీర్యకణాల సేకరణ.. ఎయిమ్స్‌ వైద్యుల విప్లవాత్మక పరిశోధన!

ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోతే ఇక ఆయన వారసత్వం అక్కడితోనే ఆగిపోయినట్టేనా? అంటే ఇకపై అలా కాకపోవచ్చు.. మరికొన్ని రోజుల్లో చనిపోయిన వ్యక్తి కూడా తండ్రి అయి తన వారసత్వాన్ని నిలబెట్టుకునే రోజులు రావచ్చు. అవును, మరణించిన వారి నుంచి వీర్యకణాలను విజయవంతంగా సేకరించి, వాటి ద్వారా సంతానోత్పత్తికి మార్గం సుగమం చేసే దిశగా ఎయిమ్స్ (AIIMS) భోపాల్ వైద్యులు కీలక పరిశోధన చేపట్టారు. ఇది విజయవంతమైతే అనుకోని ప్రమాదాల్లో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి ఇదో గొప్ప వరమనే చెప్పవచ్చు.

మరణించిన వ్యక్తి నుంచి వీర్యకణాల సేకరణ.. ఎయిమ్స్‌ వైద్యుల విప్లవాత్మక పరిశోధన!
Posthumous Sperm Retrieval
Anand T
|

Updated on: Nov 27, 2026 | 8:50 AM

Share

తమకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు దూరమైనా.. వారి జ్ఞాపకాలు మాత్రం మనతోనే ఉంటాయి. అవయవదానం ద్వారా మరణించిన వారి అవయవాల్లో తమ ఆత్మీయుల రూపాన్ని చూసుకుంటారు కొందరు. కానీ, చనిపోయిన తర్వాత కూడా వారి వారసత్వాన్ని మరో తరానికి అందించవచ్చంటే మీరు నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇప్పుడు ఇది సాధ్యమయ్యే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. అంతేకాదు, ఇప్పటికే మరణించిన ఓ వ్యక్తి నుంచి విజయవంతంగా వీర్యకణాలను సేకరించి శాస్త్రవేత్తలు సంచలనం సృష్టించారు. మరణం తర్వాత కూడా తమ సంతానాన్ని ఈ లోకంలోకి తీసుకురావచ్చనే సరికొత్త అవకాశానికి ఇది నాంది పలుకుతోంది.

ఈ సరికొత్త పరిశోదనను మధ్యప్రదేశ్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వైద్యులు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి నుంచి జనీవంగా చలనంలో ఉన్న వీర్యకణాలను సేకరించి వాటి ద్వారా సంతానోత్పత్తి కలిగించవచ్చా అనే అంశాలపై శాస్త్రీయంగా అధ్యనాలు స్టార్ట్ చేశారు. భోపాల్‌ ఎయిమ్స్‌లోని ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగం, పాథాలజీ అండ్‌ లాబొరేటరీ మెడిసిన్‌ విభాగాలు కలిసి నిర్వహించిన ఈ అధ్యయనానికి ఐసీఎంఆర్‌ ఆర్థిక సహకారం చేసింది.

ఈ అధ్యయనంలో భాగంగా పరిశోదకులు 600 మంది నుంచి దాదాపు 250కిపైగా వీర్యకణాలు సేకరించగా.. ఇందులో చనిపోయిన వారి నుంచి కూడా వీర్యకణాలను విజయవంతంగా సేకరించినట్టు తెలిపారు. ఈ పరిశోధనకు జాతీయస్థాయిలో గుర్తింపు కూడా లభించింది.

మరిన్ని సైన్స్‌ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే