AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిన్న అన్న.. నేడు తమ్ముడు.. సెహ్వాగ్‌ చిన్న కుమారుడి బీభత్సం..!

Virender Sehwag Son: వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు వేదాంత్ సెహ్వాగ్ అండర్-19 క్రికెట్‌లో అదరగొట్టాడు. కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతూ పంజాబ్‌పై ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. 22.3 ఓవర్లలో 88 పరుగులిచ్చి ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశాడు. తండ్రి బాటలోనే క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు.

నిన్న అన్న.. నేడు తమ్ముడు.. సెహ్వాగ్‌ చిన్న కుమారుడి బీభత్సం..!
Vedant Sehwag
Venkata Chari
|

Updated on: Nov 27, 2026 | 10:08 AM

Share

Vedant Sehwag: భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు వేదాంత్ సెహ్వాగ్ అండర్-19 క్రికెట్‌లో అదరగొట్టాడు. కూచ్ బెహార్ ట్రోఫీ ఎలైట్ టోర్నీలో ఢిల్లీ అండర్-19 జట్టు తరఫున ఆడుతూ పంజాబ్‌పై ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కూచ్ బెహార్ ట్రోఫీ ఎలైట్ టోర్నీలో ఢిల్లీ అండర్-19, పంజాబ్ అండర్-19 జట్ల మధ్య జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో వేదాంత్ సెహ్వాగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు తీసి ఢిల్లీ జట్టుకు ఆధిక్యం అందించాడు. వేదాంత్ మొత్తం 22.3 ఓవర్లు బౌలింగ్ చేసి 88 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. 3.91 ఎకానమీతో బౌలింగ్ చేసి పంజాబ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు.

ఢిల్లీ బౌలర్లలో నకుల్ యాదవ్ 25 పరుగులకు ఒక వికెట్ తీశాడు. రాహుల్ రాకేష్ యాదవ్, అర్నవ్ బుగ్గా కూడా తలో వికెట్ సాధించారు. దీంతో పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు ఆలౌట్ అయింది.

ఎక్కువమంది చదివినది: SL A vs IND A: ఆ ఇద్దరు కలిసి కొంప ముంచేశారు.. అందుకే చిత్తుగా ఓడిపోయాం..: తిలక్ వర్మ

పంజాబ్ బ్యాటర్లలో సహిజ్‌బోత్‌వీర్ సింగ్ 116 బంతుల్లో 61 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ నూర్‌వీర్ సింగ్ 58 బంతుల్లో 58 పరుగులతో రాణించాడు. ఆర్యవీర్ సెహ్వాగ్ 94 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.

తండ్రి బాటలోనే క్రికెట్‌లోకి సెహ్వాగ్ తనయులు..

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. తన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. సెహ్వాగ్ తన టెస్టు కెరీర్‌లో 104 మ్యాచ్‌లు ఆడి 8,586 పరుగులు, 251 వన్డేల్లో 8,273 పరుగులు సాధించాడు.

ఎక్కువమంది చదివినది: నువ్వు కెప్టెన్సీ మెటీరియల్ కాదు బ్రో .. బ్యాటర్‌గా, నాయకుడిగా అట్టర్ ఫ్లాప్.. తిలక్ వర్మపై ఫ్యాన్స్ ఫైర్..!

ఇప్పుడు అతని కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్ కూడా క్రికెట్‌లో తమ ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్యవీర్ అండర్-19 క్రికెట్‌లో తన ఆటతో గుర్తింపు తెచ్చుకోగా.. తాజాగా వేదాంత్ ఏడు వికెట్ల ప్రదర్శనతో వార్తల్లో నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే