AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఇంటర్‌ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి..’ CM రేవంత్‌రెడ్డికి లేఖ

ఇంటర్మీడియట్‌ విద్యా వ్యవస్థను పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్‌ కళాశాలల్లో 9, 10 తరగతులకు అనుమతులు ఇస్తే ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణకు వచ్చి స్థానిక కోటాలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లు పొందే అవకాశం ఉంటుందని ఓయూ ప్రొఫెసర్‌, ఫోరమ్‌ ఫర్‌ తెలంగాణ కన్వీనర్‌ ఆచార్య జగదీశ్వర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని పేర్కొంటూ నవంబరు 25న సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. అసలు ఈ నిర్ణయం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందో తెలుసుకుందాం..

'ఇంటర్‌ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి..' CM రేవంత్‌రెడ్డికి లేఖ
Telangana Intermediate Education Merger
Srilakshmi C
|

Updated on: Nov 27, 2026 | 9:58 AM

Share

హైదరాబాద్‌, నవంబర్ 27: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ విద్యా వ్యవస్థను పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్‌ కళాశాలల్లో 9, 10 తరగతులను నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వాలన్న ప్రతిపాదన రాష్ట్ర విద్యార్థులకు నష్టం కలిగించే అవకాశం ఉందని ఓయూ ప్రొఫెసర్‌, ఫోరమ్‌ ఫర్‌ తెలంగాణ కన్వీనర్‌ ఆచార్య జగదీశ్వర్‌రావు వీరనేని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన నవంబరు 25న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో 9, 10 తరగతులకు అనుమతులు ఇవ్వడం వల్ల తెలంగాణ విద్యార్థులకు స్థానిక కోటాలో లభించే అవకాశాలు తగ్గిపోతాయని లేఖలో వివరించారు.

రాష్ట్ర విద్యార్థులకు స్థానిక కోటాలో నష్టం?

తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వంటి వైద్య విద్యా కోర్సుల్లో స్థానిక కోటా కింద సీట్లు పొందాలంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలోనే చదివి ఉండాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ కళాశాలల్లోనే 9, 10 తరగతులు నిర్వహించేందుకు అనుమతిస్తే ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని ఆచార్య జగదీశ్వర్‌రావు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు ఇక్కడి ఇంటర్‌ కళాశాలల్లో 9వ తరగతిలో చేరి వరుసగా నాలుగేళ్లు చదివితే స్థానిక కోటా కింద వైద్య విద్యా సీట్లకు అర్హత పొందే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఇప్పటికే తెలంగాణలో చదువుతున్న స్థానిక విద్యార్థులకు పోటీ పెరిగి, వారి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వివరించారు.

ఇవి కూడా చదవండి

ఇంటర్‌ కళాశాలలకు 9 నుంచి 12వ తరగతి వరకు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వడం వల్ల ప్రధానంగా కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యా వ్యవస్థలో ఇలాంటి మార్పులు తీసుకొచ్చే ముందు రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలు, స్థానిక కోటా నిబంధనలు, భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాలని కోరారు. విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చేటప్పుడు తెలంగాణ విద్యార్థుల విద్యా అవకాశాలకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆచార్య జగదీశ్వర్‌రావు పేర్కొన్నారు. ఇంటర్‌ వ్యవస్థను పాఠశాల విద్యలో విలీనం చేయడం, ఇంటర్‌ కళాశాలల్లో 9, 10 తరగతులకు అనుమతులు ఇవ్వడం వంటి నిర్ణయాలను పునఃపరిశీలించాలని కోరారు. ముఖ్యంగా వైద్య విద్యలో స్థానిక విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయాన్ని పూర్తిగా విరమించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే