పెళ్లి కోసం లోన్ తీసుకుంటున్నారా..? ఈ విషయాలు మిస్ అయితే జేబు ఖాళీనే !!
వివాహం అనేది కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. జీవితంలో ఎంతో మధురమైన వేడుక. అందుకే ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలనుకునే అనుకుంటారు. ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఈ మేరకు పెళ్లి కోసం లోన్ తీసుకునేవారు ఈ విషయాలను మాత్రం మిస్ అవ్వొద్దని సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

వివాహం అనేది కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. ఇద్దరు వేర్వేరు మనుషులు.. ఒకరికొకరు ముడిపడిపోయే పవిత్రమైన బంధం. అందుకే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఈ నెల 21వ తేదీ నుంచి పెళ్లిళ్ల ముహూర్తాలు డిసెంబర్ 15వ తేదీ వరకే ఉండనున్నాయి. ఆ తర్వాత 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం కాబోతోండటం వల్ల శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. దాదాపుగా ఈ 25 రోజుల పాటు ఉండే ఈ వివాహాల సీజన్ లో..52 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరుగుతాయని వ నివేదికలో స్పష్టం చేసింది. అంతే కాకుండా ఈ మ్యారేజ్ ల కోసం రూ. 7.5 లక్షల కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.
సాధారణంగా చెప్పాలంటే పెళ్లి అనేది జీవితంలో ఎంతో మధురమైన వేడుక. అందుకే ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలనుకునే అనుకుంటారు. అయితే పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో చాలామంది పెళ్లి ఖర్చుల కోసం పర్సనల్ లోన్ లేదా మ్యారేజ్ లోన్ తీసుకోవడానికి మొగ్గు చూపుతుంటారు. లోన్ తీసుకోవడం వల్ల అప్పటి అవసరాలు ఈజీగా తీరినప్పటికీ.. తర్వాత నెలవారీ ఈఎంఐ భారం పడే ఛాన్స్ ఉంది. ఈ మేరకు పెళ్లి కోసం లోన్ తీసుకునేవారు ఈ విషయాలను మాత్రం మిస్ అవ్వొద్దని సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..
ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
పెళ్లి బడ్జెట్: ఖర్చులను అత్యవసరమైనవి, ఐచ్ఛికమైనవిగా విభజించుకోవాలి. మీ పొదుపు పోగా వచ్చే లోటుకు మాత్రమే లోన్ తీసుకోవడం ఉత్తమం.
ఈఎంఐ : నెలవారీ ఈఎంఐలు మీ మొత్తం ఆదాయంలో 35% నుంచి 40% మించకుండా చూసుకోవాలి.
వడ్డీ రేటు, ఛార్జీలు: కేవలం వడ్డీ రేటే కాకుండా ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ వంటి ఇతర ఛార్జీలను బేరీజు వేసి తక్కువ ఖర్చుతో కూడిన లోన్ ఎంచుకోవాలి.
లోన్ పీరియడ్: కాలపరిమితి ఎక్కువగా ఉంటే ఈఎంఐ తక్కువైనా వడ్డీ భారం పెరుగుతుంది. మీ ఆదాయానికి తగిన కాలం ఎంచుకోవాలి.
ఎమర్జెన్సీ ఫండ్: పెళ్లి కోసం మొత్తం పొదుపు ఖాళీ చేయకుండా, కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని పక్కన ఉంచుకోవాలి.
