మేడ్చల్ జిల్లా దుండిగల్లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ నిరాకరించిందనే కోపంతో ఓ రాపిడో డ్రైవర్ డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారం రోజులుగా వేధించి, ఇంట్లోకి చొరబడి దాడి చేసినట్లు విద్యార్థిని ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.