AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డార్జిలింగ్ నుండి ఊటీ వరకు.. ప్రకృతి ఒడిలో మైమరిపించే రైలు ప్రయాణాలు

డార్జిలింగ్ నుండి ఊటీ వరకు.. ప్రకృతి ఒడిలో మైమరిపించే రైలు ప్రయాణాలు

Phani CH
|

Updated on: Nov 07, 2026 | 9:12 PM

Share

భారతదేశంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ రైలు ప్రయాణం చేయాలనుకునేవారికి ఎన్నో అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. ఊటీ టాయ్‌ ట్రైన్‌ నుంచి విశాఖ–అరకు, డార్జిలింగ్‌ హిమాలయన్‌ రైల్వే వరకు ప్రతి ప్రయాణం ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. మంచు కొండలు, పచ్చని లోయలు, సొరంగాలు, జలపాతాల మధ్య సాగే ఈ ప్రయాణాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. రాజరికపు విలాసాన్ని కోరుకునేవారికి రాజస్థాన్‌ ప్యాలెస్‌ ఆన్‌ వీల్స్‌ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

కొన్ని ప్రయాణాలు కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికే పరిమితమైతే.. మరికొన్ని ప్రయాణాలు మన జీవితంలో మర్చిపోలేని తీపి జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. పచ్చని చెట్లు, మంచు కురిసే కొండలు, దట్టమైన అడవుల గుండా వేగంగా సాగే రైలు ప్రయాణంలో కిటికీ పక్కన కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదించడంలో ఉన్న అనుభూతే వేరు. భారతీయ రైల్వేల్లో పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే అద్భుతమైన మార్గాలు కొన్ని ఉన్నాయి. తమిళనాడులోని నీలగిరి పర్వత రైల్వే ..యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా పొందిన ఈ రైల్వే ప్రయాణం ఒక కలల ప్రయాణంలా సాగుతుంది. నీలి, క్రీమ్ రంగుల ఐకానిక్ టాయ్ ట్రైన్ మెట్టుపాళ్య నుంచి ఊటీ వరకు దాదాపు 46 కిలోమీటర్ల మేర నెమ్మదిగా సాగుతుంది. పచ్చని కొండలు, పొగమంచుతో కప్పబడిన లోయలు, దట్టమైన అడవుల గుండా సాగే ఈ ప్రయాణం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం –అరకు లోయ : విశాఖ నుంచి తూర్పు కనుమల్లోని అరకు లోయకు చేసే రైలు ప్రయాణం కనులవిందుగా ఉంటుంది. ఈ మార్గం 58 సొరంగాలు, 84 వంతెనల గుండా వెళుతూ కాఫీ తోటలు, జలపాతాలు, పొగమంచు కొండల దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. ప్రసిద్ధ బొర్రా గుహలు, పచ్చటి లోయల సోయగాలు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే : డార్జిలింగ్ టాయ్ ట్రైన్‌గా గుర్తింపు పొందిన ఈ రైల్వే పశ్చిమ బెంగాల్‌లోని పచ్చని కొండల గుండా సాగుతుంది. ప్రయాణంలో టీ ఎస్టేట్లు, దట్టమైన అడవులతో పాటు మంచుతో కప్పబడిన కాంచన్‌జంగా పర్వత శిఖరాల దృశ్యాలను తిలకించవచ్చు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కల్కా – సిమ్లా రైల్వే : యునెస్కో వారసత్వ జాబితాలో ఉన్న మరో ఇంజనీరింగ్ అద్భుతం కల్కా-సిమ్లా నారో-గేజ్ రైల్వే. శివాలిక్ కొండల గుండా 96 కిలోమీటర్లు సాగే ఈ ప్రయాణంలో 100కి పైగా సొరంగాలు, 800కు పైగా వంతెనలు ఉన్నాయి. బరోగ్, ధరంపూర్ వంటి వలసరాజ్యాల కాలం నాటి స్టేషన్లు, లోతైన లోయలు పర్యాటకులను ఆహ్లాదపరుస్తాయి. రాస్థాన్‌లోని ప్యాలెస్ ఆన్ వీల్స్ రైల్వే: రాజరికపు అనుభూతిని పొందాలనుకునే వారికి ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ సరైన ఎంపిక. ఒకప్పుడు రాజస్థాన్ మహారాజులు ప్రయాణించిన రాజబండ్ల తరహాలోనే విలాసవంతమైన ఇంటీరియర్స్, రెస్టారెంట్ సౌకర్యాలతో దీనిని తీర్చిదిద్దారు. ఇది జైపూర్, ఉదయపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, రణతంబోర్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దీపావళిని 5 రోజులు ఎందుకు జరుపుకుంటారు?

బెంగళూరు నుంచి హైదరాబాద్‌ 2 గంటలే..

ఐటీ ఉద్యోగుల నయా ట్రెండ్‌.. వర్క్ ఫ్రమ్ పార్క్

నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? రేణుదేశాయ్‌ కామెంట్స్‌ వైరల్‌

తెరపై నటులు.. కానీ నిజ జీవితంలో దొంగలు

Follow Us