రామాయణంలో నా పాత్ర నిడివి చాలా తక్కువ.. కాజల్ అగర్వాల్ రియాక్షన్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

08 November 2026

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పౌరాణిక దృశ్యకావ్యం రామాయణం బాక్సాఫీస్ వద్ద అపూర్వమైన విజలతో దూసుకుపోతోంది.

నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటించగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ లంకేశ్వరుడిగా కనిపించారు.

ఈ భారీ చిత్రంలో రావణాసురుని ధర్మపత్ని మండోదరి పాత్రలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన విషయం తెలిసిందే. తాజాగా తన పాత్ర ఫోటోస్ షేర్ చేశారు.

సినిమాలో మండోదరిగా రాజసం ఉట్టిపడే తన లుక్స్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ కాజల్ భావోద్వేగానికి గురయ్యారు

ఈ చిత్రంలో తన పాత్ర స్క్రీన్ టైమ్ లేదా నిడివి చాలా తక్కువగా ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ, మన సంస్కృతి, చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన

రామాయణం వంటి గొప్ప మహాకావ్యంలో భాగం కావడమే తనకు అత్యంత గౌరవంగా ఉందని తెలిపారు. ఇటువంటి భారీ ప్రాజెక్ట్‌లో సహ నటులతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. 

కొన్ని చిత్రాలలో పాత్రల నిడివి కంటే ఆ కథకు ఉన్న ప్రాముఖ్యత, దాన్ని తెరకెక్కించడంలో దర్శకులు, నిర్మాతలు పడే తపన మాత్రమే ముఖ్యమని కాజల్ అభిప్రాయపడ్డారు. 

ఈ చారిత్రాత్మక చిత్రంలో తనకు అవకాశం కల్పించిన దర్శకుడు నితీష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రాకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం కాజల్ ఫోటోస్ వైరలవుతున్నాయి.