Video: కస్టమర్లలా వచ్చి కళ్లముందే మాయం చేశారు.. జ్యువెలరీ షాపులో సినిమా లెవల్ దొంగతనం..
నగలు కొంటామంటూ దర్జాగా షాపులోకి ఎంట్రీ ఇచ్చారు.. గుమాస్తాను మాటల్లోకి దింపి మైండ్ బ్లాంక్ చేశారు.. కనురెప్ప మూసి తెరిచేలోపే చేతివాటం ప్రదర్శించి ఏకంగా రూ. 2 లక్షల విలువైన వెండిని స్వాహా చేశారు. ఖమ్మం జిల్లాలో కిలాడీ మహిళలు చేసిన సినిమా లెవల్ చోరీ స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోను మీరే చూడండి..
కస్టమర్ల రూపంలో లోపలికి వచ్చారు.. కొనడానికి వచ్చినట్లు నటించి సిబ్బందిని బురిడీ కొట్టించారు.. రెప్పపాటులో తమ చేతివాటం ప్రదర్శించి ఏకంగా రూ. 2 లక్షల విలువైన వెండి ఆభరణాలతో పరారయ్యారు. ఖమ్మం జిల్లాలో సినిమాను తలపించేలా చోటుచేసుకున్న ఈ కిలాడీ మహిళల ఘరానా చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని ప్రముఖ బీఎస్జే జ్యువెలర్స్ షాపులో ఈ ఘటన వెలుగుచూసింది. దుకాణంలోకి సాధారణ కొనుగోలుదారుల మాదిరిగానే కొందరు గుర్తుతెలియని మహిళలు వచ్చారు. ఆ సమయంలో షాపులో ఉపేందర్ అనే గుమాస్తా విధుల్లో ఉన్నాడు. నగల కొనుగోలుపై ఆరా తీస్తూ అతడిని మాటల్లోకి దింపిన ఆ మహిళలు, తమ మాయోపాయంతో అతడి దృష్టి మళ్లించారు.
కంటికి కనిపించకుండా వెండి పట్టీలు మాయం
గుమాస్తా దృష్టి పక్కకు మళ్లిన క్షణాల్లోనే, ఆ కిలాడీ లేడీస్ కౌంటర్లో ఉన్న సుమారు రూ. 2 లక్షల విలువైన వెండి పట్టీలను చాకచక్యంగా కొట్టేశారు. అనంతరం ఏమీ తెలియనట్లుగా షాపు నుంచి గుట్టుచప్పుడు కాకుండా జారుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆభరణాలు కనిపించకపోవడంతో కంగారుపడ్డ గుమాస్తా, దుకాణం వెలుపల వారి కోసం గాలించినా అప్పటికే వారు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అద్దె ఇల్లు కావాలని వచ్చి.. అడ్డంగా దోచేశారు!
4,218 కిలోమీటర్లు ఆటో రిక్షాలో ప్రయాణించి బ్రిటన్ జంట.. చివరికి!
దీపావళిని 5 రోజులు ఎందుకు జరుపుకుంటారు?
ఐటీ ఉద్యోగుల నయా ట్రెండ్.. వర్క్ ఫ్రమ్ పార్క్
ప్యాసింజర్ లగేజ్ చెక్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్
మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?
హాస్టల్ గదుల్లో నాగుపాములు, తేళ్లు..విద్యార్థినులను కరిచిన ఎలుకలు

