AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్దె ఇల్లు కావాలని వచ్చి.. అడ్డంగా దోచేశారు!

అద్దె ఇల్లు కావాలని వచ్చి.. అడ్డంగా దోచేశారు!

Phani CH
|

Updated on: Nov 08, 2026 | 8:50 AM

Share

హనుమకొండలో అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చిన ఇద్దరు మహిళలు 70 ఏళ్ల వృద్ధురాలిని కట్టేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. వాయుపుత్ర కాలనీలోని ఓ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వృద్ధురాలి కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకునేలోపే నిందితులు పరారయ్యారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో వారి దృశ్యాలు రికార్డయ్యాయి. ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హనుమకొండలో మహిళా దొంగలు తీవ్ర కలకలం సృష్టించారు. ఒకవైపు పోలీసులు క్రీడాపోటీల్లో నిమగ్నమై ఉండగా, మరోవైపు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించి ఒక ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియంలో ప్రస్తుతం రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్ జరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులంతా ఆటలు, పోటీల్లో నిమగ్నమై తమ ప్రతిభను చాటుకుంటున్నారు. సరిగ్గా ఈ సమయాన్నే అదునుగా భావించిన ఇద్దరు మహిళా దొంగలు పక్కా పథకంతో రంగంలోకి దిగారు. వాయుపుత్ర కాలనీలో ‘టూ లెట్’ బోర్డు పెట్టి ఉన్న ఒక ఇంటిని ఈ దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. అద్దెకు ఇల్లు కావాలంటూ చాలా క్లాస్‌గా తయారై ఆ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో జయప్రద అనే 70 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా ఉంది. అది గమనించిన ఆ మహిళా దొంగలు క్షణాల్లో విరుచుకుపడ్డారు. వృద్ధురాలి కాళ్లు, చేతులు కట్టేసి, ఆమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. అనంతరం ఆమె మెడలోని బంగారు గొలుసు, చేతికి ఉన్న బంగారు గాజులను దోచుకున్నారు. వృద్ధురాలు ధైర్యం చేసి గట్టిగా కేకలు వేయడంతో స్పందించిన ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకుని వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఆ మహిళా దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందగానే స్పోర్ట్స్ మీట్‌లో ఉన్న పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని దొంగల కోసం గాలింపు చేపట్టారు. ఘటనా స్థలంలో పరిశీలించగా, నీట్‌గా తయారై వచ్చిన ఆ ఇద్దరు మహిళల దృశ్యాలు సమీపంలోని సీసీ టీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ వేగవంతం చేశారు. ఈ దోపిడీకి పాల్పడిన మహిళలు పొరుగు రాష్ట్రానికి చెందిన ముఠాగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అద్దె ఇంటి నెపంతో వచ్చి వృద్ధురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దీపావళిని 5 రోజులు ఎందుకు జరుపుకుంటారు?

బెంగళూరు నుంచి హైదరాబాద్‌ 2 గంటలే..

ఐటీ ఉద్యోగుల నయా ట్రెండ్‌.. వర్క్ ఫ్రమ్ పార్క్

నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? రేణుదేశాయ్‌ కామెంట్స్‌ వైరల్‌

తెరపై నటులు.. కానీ నిజ జీవితంలో దొంగలు

Follow Us