జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. అజ్మీరా చందు అనే 30 ఏళ్ల వ్యక్తిని అతని భార్య పావని, ఆమె ప్రియుడు సంతోష్ కలిసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఎడ్లబండిపై తరలించి చికెన్పల్లి గ్రామ సమీపంలో పడేశారు. నిందితులైన భార్య, ప్రియుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.