AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Korean Kanakaraju: క్రేజీగా కొరియన్‌ కనకరాజు ట్రైలర్‌.. వరుణ్‌కు బ్రేక్‌ వస్తుందా?

Korean Kanakaraju: క్రేజీగా కొరియన్‌ కనకరాజు ట్రైలర్‌.. వరుణ్‌కు బ్రేక్‌ వస్తుందా?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 03, 2026 | 8:30 AM

Share

వరుస పరాజయాల తర్వాత వరుణ్ తేజ్ నటిస్తున్న మాస్ హారర్ కామెడీ 'కొరియన్ కనకరాజు' ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ రెండు విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నారు. సత్య కామెడీ, తమన్ సంగీతం, రిచ్ విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఆగస్టు 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటాలంటే సరైన కమర్షియల్ సబ్జెక్ట్ పడాలి. అలా ప్రేక్షకుల నాడి పట్టుకున్న వాళ్లే బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ఇవ్వగలుగుతారు. లేదంటే.. ప్రయోగాలు బెడిసికొట్టి కెరీర్ కాస్త డైలమాలో పడుతుంది. ప్రజెంట్ వరుస పరాజయాలతో ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఇప్పుడు తన రూటు మార్చి చేస్తున్న మాస్ అటెంప్టే ‘కొరియన్ కనకరాజు’. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈసినిమా ట్రైలర్‌ రిలీజ్ అయ్యింది. ఆ ట్రైలర్‌ టాక్‌ ఎలా ఉంది? వరుస ప్లాపులతో బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్, ఈసారి పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో-కొరియన్ హారర్ కామెడీగా తెరకెక్కుతున్న కొరియన్ కనకరాజు మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్‌లో అనంతపురం కుర్రాడిగా మాస్ బాడీ లాంగ్వేజ్‌తో, కొరియన్ మాఫియా డాన్‌గా స్టైలిష్ లుక్‌లో.. రెండు డిఫరెంట్‌ షేడ్స్‌లో అదరగొట్టారు వరుణ్‌. ట్రైలర్‌లో కమెడియన్ సత్య చెప్పిన పంచ్ డైలాగ్స్, కామెడీ టైమింగ్ సినిమా మీద మంచి బజ్‌ క్రియేట్ చేస్తోంది. అనంతపురం యువకుడికి, కొరియన్ మాఫియాకి సంబంధం ఏంటి..? అసలు కనకరాజులోకి కొరియన్‌ ఆత్మ ఎందుకు వచ్చింది అన్న పాయింట్‌ను ఎంటర్‌టైనింగ్‌గా తెర మీద చూపించబోతున్నారు మేకర్స్. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మించిన ఈ మూవీ విజువల్స్ పరంగానూ రిచ్‌గా ఉంది. తమన్ మ్యూజిక్‌ ఆ విజువల్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. ఆగస్టు 7న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన కంసామీద, రాసా గుమ్మాడి సాంగ్స్‌ మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ట్రైలర్‌కు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో సక్సెస్ విషయంలో మరింత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు మేకర్స్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా!

స్కూటీలో భారీ పాము..భయంతో జనం పరుగులు

OTT కొత్త రూల్స్.. నిర్మాతలకు వరమా? శాపమా?

పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!

Chicken Manchurian: మంచూరియా చైనా వంటకం కాదు.. మన ఇండియాదే.. ఏ ఊరిదో తెలుసా?

Follow Us