AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ చూడొచ్చు..IMDBలో టాప్ రేటింగ్ మూవీ

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఓవరాల్ గా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమాకు ఐఎమ్ డీబీలోనూ టాప్ రేటింగ్ దక్కడం విశేషం.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ చూడొచ్చు..IMDBలో టాప్ రేటింగ్ మూవీ
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 12, 2026 | 7:15 AM

Share

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (జూన్ 14) కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. వీటితో పాటు కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించిన ఒక తమిళ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఓరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో ఈ మూవీకి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆడియెన్స్ అందరూ పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. ఈ క్రమంలోనే మూవీకి రికార్డు కలెక్షన్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ సినిమాకు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. అనారోగ్యం పాలైన కూతురికి చికిత్స చేయించేందుకు హైదరాబాద్ కు తీసుకొస్తాడు ఓ తండ్రి. అయితే నాంపల్లి రైల్వే స్టేషన్ లో దిగగానే దొంగలు వారిపై దాడి చేసి 60 సవర్ల బంగారం దోచుకుని వెళ్లి పోతారు. కూతురి ఆపరేషన్‌ కోసం అమ్ముదామని తెచ్చిన నగలను ఎలాగైనా ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించిన వారికి కేవలం 45 సవర్ల బంగారం మాత్రమే రికవరీ చేసి ఇస్తారు. అది కూడా కోర్టు ఆర్డర్‌ ద్వారా తీసుకోవాలని ఆదేశాలిస్తారు. దీంతో వారు లాయర్‌ బేబీ కృష్ణ దగ్గరకు వెళ్తారు. పక్కా కమర్షియల్ లాయర్‌ అయిన బేబీ కృష్ణ.. తండ్రీకూతుళ్ల దీన పరిస్థితి తెలిసినా డబ్బు కోసం జడ్జితో కలిసి కేసు వాయిదాల మీద వాయిదాలు వేయిస్తూ ఉంటాడు.

చివరకు తండ్రీ కూతుళ్లు ఎదురు తిరగడంతో పోలీసులు రికవరీ చేసిన బంగారం కూడా దక్కకుండా చేస్తానని అంటాడు. దీంతో కోర్టు ఆవరణలో ఉన్న వీరభద్రుడి ఆలయానికి వెళ్లి, తన కష్టాన్ని తీర్చమని ఆ తండ్రి వేడుకుంటాడు. మరి అక్కడి క్షేత్రపాలకుడైన వీరభద్రుడు ) భూమ్మీదకు వచ్చాక ఏం జరిగింది? తండ్రీకూతుళ్లకు న్యాయం జరిగిందా? అన్నది ఈ సినిమా కథ. ఈపాటికే అర్థమై ఉంటుంది మనం ఏ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. సూర్య నటించిన కరుప్పు సినిమా (తెలుగులో వీరభద్రుడు) ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూర్య కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..
తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తినొచ్చా
తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తినొచ్చా
ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?
ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?
టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?
టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?
శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..
శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..