AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెల్ఫీ వీడియోలతో Gen Zను నేరుగా పలకరించిన మోదీ

సెల్ఫీ వీడియోలతో Gen Zను నేరుగా పలకరించిన మోదీ

Phani CH
|

Updated on: Aug 02, 2026 | 1:13 PM

Share

జెన్‌జీతో నేరుగా కనెక్ట్ కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియోలను కొత్త కమ్యూనికేషన్ సాధనంగా వినియోగిస్తున్నారు. పేపర్ లీక్‌లపై కేంద్రం తీసుకుంటున్న చర్యలను షార్ట్ వీడియోల రూపంలో వివరిస్తూ యువతను ఆకర్షిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ స్పందన దక్కిన ఈ వీడియోలు డిజిటల్ రాజకీయాలకు కొత్త బెంచ్‌మార్క్‌గా నిలుస్తున్నాయి.

జెన్‌జీని టచ్ చేయాలంటే… జెన్‌జీ లాంగ్వేజ్ మాట్లాడాల్సిందే! ఇప్పుడదే చేస్తున్నారు ప్రధాని మోదీ. చేతిలో ఫోన్.. ముఖంలో చిరునవ్వు ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ఫ్రెండ్స్.. అంటూ ఆత్మీయ పలకరింపుతో సెల్ఫీ వీడియోలు. ఇప్పుడు డిజిటల్ రాజకీయాల కొత్త బెంచ్‌మార్క్‌గా మారాయి ప్రధాని మోదీ సెల్ఫీ వీడియోలు. ఒక్కో వీడియో కేవలం వ్యూస్ మాత్రమే కాదు… కోట్లాది యువత దృష్టిని, లక్షలాది కొత్త ఫాలోవర్లను ఆకర్షించాయి. డిజిటల్ యుగంలో లీడర్‌షిప్ అంటే ఇదేనని నిరూపించారు ప్రధాని నరేంద్రమోదీ. దేశవ్యాప్తంగా జెన్‌ జీ ఉద్యమానికి తెరలేపిన పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ వరుస వీడియోలతో యువతకు టచ్‌లో ఉంటున్నారు ప్రధాని మోదీ. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు నిర్ణయాన్ని కూడా షార్ట్ వీడియో రూపంలో వెల్లడించారు. మొదటి సెల్ఫీ వీడియో విడుదలైన కొద్ది గంటల్లోనే అది వందల మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 10 లక్షల కొత్త ఫాలోవర్లు చేరగా, మొత్తం ఫాలోవర్ల సంఖ్య 10.2 కోట్లకు చేరింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి సెల్ఫీ వీడియో జెన్‌జీని ఆకట్టుకుంది. లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్ ఆమోదం పొందగానే మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. యువత భవిష్యత్‌ను నాశనం చేసే ఎలాంటి చర్యనైనా కేంద్రం ఉపేక్షించదన్న మెసేజ్ పంపారు. గురవారం రాత్రి కూడా మరో సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు ప్రదాని మోదీ. రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం పొందిన తర్వాత విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న పరీక్షల ప్రశ్నపత్రాల లీకు మాఫియాను అంతం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. జెన్-జీ దృష్టిని ఆకర్షించడం ఈ రోజుల్లో అత్యంత కష్టమైన పని. సెకన్లలో నిర్ణయాలు తీసుకునే ఈ తరం.. ఇన్‌స్టంట్ రిజల్ట్ వస్తేనే ఆమోదిస్తోంది. అందుకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను కేవలం ప్రచార వేదికగా కాకుండా, యువతకు మరింత దగ్గరయ్యేలా వారికి కనెక్ట్ అయ్యే భాషలోనే మాట్లాడటం ఈ సెల్ఫీ వీడియోల ప్రత్యేకత.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Burj Khalifa: గుడ్‌న్యూస్.. యూపీఐతో బుర్జ్ ఖలీఫా టికెట్లు

వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు

మధ్యాహ్నం వేళ నీరసంగా అనిపిస్తోందా.. ఇదిగో సరికొత్త ట్రిక్ ‘కాఫీ నాప్’

ఇతను బస్సు డ్రైవరా.. కుబేరుడా!

మీ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ సురక్షితమేనా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!

Follow Us