మీరు సంపాదించిన సంపద, పెట్టుబడులు, ఆస్తుల వివరాలు అత్యవసర పరిస్థితుల్లో మీ కుటుంబానికి తెలియకపోతే సమస్యలు తలెత్తుతాయి. మీ కుటుంబ ఆర్థిక భద్రత కోసం ప్రతి ఒక్కరూ నాలుగు రకాల ముఖ్యమైన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి: ఇన్సూరెన్స్, బ్యాంకింగ్/పెట్టుబడులు, గుర్తింపు పత్రాలు, రుణ పత్రాలు. వీటిని భద్రపరిచి, వాటి వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేయడం అత్యంత అవసరం.