AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: 174 కోట్ల వ్యూస్, 7 కోట్ల లైక్స్‌తో సంచలనం.. 7 ఏళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న సాంగ్

ఈ సినిమా హిట్ యావరేజ్ గా నిలిచినా ఇందులోని ఈ సాంగ్ మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎప్పుడో ఏడేళ్ల క్రితం ఈ సాంగ్ వచ్చినప్పటికీ ఇప్పటికీ యూట్యూబ్ ను ఊపేస్తోంది. ఇక ఇన్ స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లోనూ ఈ సాంగే ఎక్కువగా కనిపిస్తుంటుంది.

Trending Song: 174 కోట్ల వ్యూస్, 7 కోట్ల లైక్స్‌తో సంచలనం.. 7 ఏళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న సాంగ్
Trending Song
Basha Shek
|

Updated on: Jun 07, 2026 | 7:19 PM

Share

ఇప్పుడు సినిమా పాటలకు కొలమానం యూట్యూబ్ వ్యూస్ అని చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగానే కొన్ని పాటలు యూట్యూబ్ రికార్డులను ఇట్టే బ్రేక్ చేస్తున్నాయి. గతంలో లక్షల వ్యూస్ కే పరిమితమైన పాటలు ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని వందల కోట్ల వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ పాటలకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. కొన్ని పాటలను జనం రిపీటెడ్ గా వింటున్నారు, చూస్తున్నారు. అందుకే ఈ మధ్యన ఫోక్ సాంగ్స్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. అలాగే ప్రైవేట్ వీడియోలకు కూడా విపరీతమైన ఆదరణ దక్కుతోంది. అయితే వీటి మధ్యన కొన్ని సినిమా పాటలకు కూడా యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ వస్తోంది. అలా ఓ పాటకు ఏకంగా 174 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు దాదాపు 7 కోట్లకు పైగా లైక్స్ సాధించింది. తద్వారా ఇప్పటి వరకు ఇండియాలో యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ సాంగ్స్ లో ఇది రెండో ప్లేస్ లో కొనసాగుతోంది. సాంగ్ వచ్చి ఏడేళ్లయినా ఇప్పటికీ యూట్యూబ్ ను షేక్ చేస్తోన్న ఆ పాట మరేదో కాదు.. కోలీవుడ్ స్టార్ ధనుష్, లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి నటించిన రౌడీ బేబీ సాంగ్.

2018 డిసెంబర్ లో రిలీజైన మారి 2 సినిమా జస్ట్ యావరేజ్ గా నిలిచింది. కానీ ఈ సినిమాలోని రౌడీ బేబీ సాంగ్ మాత్రం యూట్యూబ్ లో చార్ట్ బస్టర్ గా నిలిచింది. సోషల్ మీడియాను ఒక ఊపు ఊపింది. ఈ సాంగ్ ఇప్పటి వరకూ యూట్యూబ్ లో 174 కోట్ల 46 లక్షల 80 వేల 94 వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు దాదాపు 7 కోట్ల 2 లక్షల లైక్స్ ను సాధించింది. ఇండియా మొత్తంలో చూసుకుంటే రౌడీ బేబీ సాంగ్ ఇప్పుడు రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ సాంగ్ కు ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. అందుకు తగ్గట్టుగానే ధనుష్, సాయి పల్లవి తన హుషారైన స్టెప్పులతో ఆడియెన్స్ ను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా న్యాచురల్ బ్యూటీ తన ఎక్స్ ప్రెషన్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ తో రౌడీ బేబీ సాంగ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. అలాగే యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ కూడా రౌడీ బేబీ సాంగ్ కు చాలా ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు.

దక్షిణాది పాటలకు సంబంధించి యూట్యూబ్ లో రౌడీ బేబీ సాంగ్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. సెకెండ్ ప్లేస్ లో అల్లు అర్జున్, పూజా హెగ్డేల బుట్ట బొమ్మ సాంగ్ ఉంది. ఇప్పటివరకు ఈ పాట కు 94 కోట్ల 28 లక్షల 36 వేల 697 వ్యూస్ వచ్చాయి. తమన్ మ్యూజిక్ అందించిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం విశేషం.

ఇవి కూడా చదవండి

రౌడీ బేబీ వీడియో సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us