Anasuya: భరించలేకపోయా.. అందుకే ‘జబర్దస్త్’ నుంచి బయటకు వచ్చేశా! ఎట్టకేలకు అసలు విషయం చెప్పిన అనసూయ
స్టార్ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె డేరింగ్ అండ్ డ్యాషింగ్.. ఏ విషయమైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. మనసులో ఏదీ దాచుకోదు. అలా తాజాగా జబర్దస్త్ షో గురించి అనసూయ షేర్ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

పాపులర్ కామెడీ షో జబర్దస్త్ కు చాలా ఏళ్ల పాటు యాంకర్ గా చేసింది అనసూయ భరద్వాజ్. అయితే ఉన్నట్లుండి ఆ షోకు గుడ్ బై చెప్పేసిందీ అందాల తార. ఇప్పుడువెండితెరపై రాణిస్తోన్న ఆమె సహాయక నటి పాత్రలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అయితే తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిన జబర్దస్త్ ను వదిలేయడానికి గల కారణాలపై అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది అనసూయ. తాజాగా మరోసారి జబర్దస్త్ గురించి ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేసింది అనసూయ. ఈ పాపులర్ కామెడీ షోను వదిలిపెట్టడానికి గల కారణాలపై ఓపెన్ గా మాట్లాడింది. గతంలో కొన్ని సామాజికాంశాలపై తను తీసుకున్న స్టాండ్స్, నిర్మొహమాటంగా చెప్పిన వ్యక్తిగత అభిప్రాయాల వల్ల.. సదరు మేకర్స్ క్రియేటివిటీకి తను పెద్ద అడ్డుకట్టలా మారానని, అందుకే తనపై నెగెటివ్ ముద్ర వేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన గొంతు నొక్కేయాలని చూశారని, అందుకే ఒక పాపులర్ షో నుంచి తాను పూర్తిగా తప్పుకున్నట్లు అనసూయ వాపోయింది. ఆ షో పేరు ఏంటన్నది అనసూయ నేరుగా చెప్పకపోయినా జబర్దస్త్ గురించే ఆమె మాట్లాడిందని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ మేరకు తన ఇన్ స్టాలో అనసూయ చేసిన పోస్టులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
కాగా టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అయితే ఎప్పుడైతే జబర్దస్త్ లోకి అడుగు పెట్టిందో అనసూయ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తన అందం, చలాకీతనం, ముద్దు ముద్దు మాటలతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైందీ అందాల తార. కానీ ఉన్నట్లుండి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిందీ ముద్దుగుమ్మ. అదే సమయంలో క్షణం, సోగ్గాడే చిన్ని నాయనా వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే బుల్లితెరకు శాశ్వతంగా బై బై చెప్పేసి ఇప్పుడు వెండితెరపైనే రాణిస్తోంది.
హాట్ టాపిక్ గా మారిన అనసూయ పోస్ట్ ఇదే..
View this post on Instagram
గతేడాది హరి హర వీరమల్లు, అరి: మై నేమ్ ఈజ్ నో బడీ అనే సినిమాల్లో నటించింది అనసూయ. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాగ బంధనం, ప్లాష్ బ్యాక్, వోల్ఫ్ తో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
రజనీకాంత్ తో అనసూయ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




