AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haridwar Ardha Kumbh 2027: హరిద్వార్ అర్ధ కుంభమేళా ఎప్పటి నుంచి? పవిత్ర స్నానాల తేదీలు ఇవే!

Haridwar Ardha Kumbh 2027 Telugu: 2027లో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా జరగనుంది. జనవరి 14 నుంచి ఏప్రిల్ 20 వరకు జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకలో ప్రధాన పవిత్ర స్నానాలు, అమృత స్నానాల తేదీలు ఏమిటి? అర్ధ కుంభమేళా విశిష్టత గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Haridwar Ardha Kumbh 2027: హరిద్వార్ అర్ధ కుంభమేళా ఎప్పటి నుంచి? పవిత్ర స్నానాల తేదీలు ఇవే!
Haridwar Ardha Kumbh 2027 Telugu
Rajashekher G
|

Updated on: Nov 27, 2026 | 2:54 PM

Share

Haridwar Ardha Kumbh 2027 Telugu: 2025లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆకర్షణగా నిలిచింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగిన ఈ మహా వేడుకకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చారు. అధికారిక గణాంకాల ప్రకారం, 66 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇప్పుడు మరో భారీ ఆధ్యాత్మిక వేడుకకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈసారి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా సందడి నెలకొననుంది. 2027లో హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సాధువులు, అఖాడాలు, భక్తులు గంగానది తీరానికి చేరుకోనున్నారు. ముఖ్యంగా అమృత స్నానాల రోజుల్లో హర్ కి పౌరి సహా ప్రధాన ఘాట్‌ల వద్ద భక్తుల రద్దీ భారీగా ఉండనుంది.

హరిద్వార్ అర్ధ కుంభమేళా 2027 ఎప్పుడు?

హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా జనవరి 14, 2027 నుంచి ఏప్రిల్ 20, 2027 వరకు జరగనుంది. మకర సంక్రాంతి నుంచి చైత్ర పౌర్ణమి వరకు పలు పవిత్ర స్నాన పర్వదినాలు రానున్నాయి. ఈ సందర్భంగా మొత్తం 11 స్నాన తేదీలను ప్రకటించారు. వీటిలో నాలుగు అమృత స్నానాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

హరిద్వార్ అర్ధ కుంభమేళా స్నాన తేదీలు

  • జనవరి 14, 2027 – మకర సంక్రాంతి
  • ఫిబ్రవరి 6 – మౌని అమావాస్య
  • ఫిబ్రవరి 11 – వసంత పంచమి
  • ఫిబ్రవరి 20 – మాఘ పౌర్ణమి
  • మార్చి 6 – మహాశివరాత్రి (అమృత స్నానం)
  • మార్చి 8 – ఫాల్గుణ అమావాస్య (అమృత స్నానం)
  • మార్చి 15 – దేవ్ డోలీ స్నానం (అమృత స్నానం)
  • ఏప్రిల్ 7 – నవ సంవత్‌సర స్నానం
  • ఏప్రిల్ 14 – మేష సంక్రాంతి (ప్రధాన అమృత స్నానం)
  • ఏప్రిల్ 15 – రామ నవమి
  • ఏప్రిల్ 20 – చైత్ర పౌర్ణమి (చివరి స్నానం)

హరిద్వార్‌ను అర్ధ కుంభమేళా అని ఎందుకు పిలుస్తారు?

సంప్రదాయం ప్రకారం, హరిద్వార్, ప్రయాగ్‌రాజ్ వంటి పుణ్యక్షేత్రాల్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా, ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా నిర్వహిస్తారు. హరిద్వార్‌లో చివరి పూర్ణ కుంభమేళా 2021లో జరిగింది. దీంతో 2027లో జరిగే వేడుకను అర్ధ కుంభమేళాగా పరిగణిస్తున్నారు. అయితే, ఈసారి ఉత్తరాఖండ్ ప్రభుత్వం పూర్ణ కుంభమేళా స్థాయిలోనే వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

అర్ధ కుంభమేళా ప్రాముఖ్యత

హిందూ మత విశ్వాసాల ప్రకారం, కుంభమేళా సమయంలో గంగానదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి, పుణ్యఫలాలు లభిస్తాయని నమ్ముతారు. జీవితంలో సుఖశాంతులు, శ్రేయస్సు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే కుంభమేళా, అర్ధ కుంభమేళా సమయంలో గంగామాత ఆశీస్సులు పొందేందుకు దేశవ్యాప్తంగా భక్తులు హరిద్వార్‌కు తరలివస్తారు.

(Disclaimer: కుంభమేళా, పవిత్ర స్నానాల ప్రాముఖ్యతకు సంబంధించిన వివరాలు హిందూ మత విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా అందించబడ్డాయి. స్నాన తేదీలు, కార్యక్రమాల షెడ్యూల్‌లో మార్పులు ఉండవచ్చు. భక్తులు అధికారిక ప్రకటనలను పరిశీలించగలరు.)

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే