మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం..
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా మహిళలకు రిజర్వేషన్లు కల్పించే కీలక రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయంతో దేశ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని నియోజకవర్గాల సీట్ల సంఖ్యను సమాన నిష్పత్తిలో 50 శాతం పెంచనున్నారు. ఈ రిజర్వేషన్, పునర్విభజన ఏర్పాటు 2051 సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టవచ్చంటూ గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో ఈ అంశంపై నెలకొన్న స్పష్టత వచ్చింది. మరోవైపు ప్రభుత్వం నవంబర్ 30వ తేదీన లోక్‌సభ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లోనే ఈ రాజ్యాంగ సవరణ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. రానున్న లోక్‌సభ సమావేశాల్లో ఈ బిల్లుపై జరిగే చర్చలు, రాజకీయ పార్టీల స్పందనలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.