AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేదరికం అడ్డుకాలేదు ఈ పల్లెటూరి అమ్మాయికి.. 19 ఏళ్లకే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం!

19-Year-Old Priyanka Prajapat Success Story: పట్టుదల, కష్టపడి చదివే తత్వం, ఆత్మవిశ్వాసం ఉంటే పేదరికం, గ్రామీణ నేపథ్యం విజయానికి అడ్డంకులు కావని మరోసారి నిరూపించింది రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల యువతి ప్రియాంక ప్రజాపత్. చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన ఆమె ఏకంగా భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలో ఆడిటర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఆమె సాధించిన ఈ ఘనతతో కుటుంబ సభ్యులే కాకుండా గ్రామస్తులు సైతం ఆనందంలో మునిగిపోయారు. ప్రస్తుతం ప్రియాంక విజయగాథ సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది..

పేదరికం అడ్డుకాలేదు ఈ పల్లెటూరి అమ్మాయికి.. 19 ఏళ్లకే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం!
Rajasthan Girl Priyanka Prajapat Success Story
Srilakshmi C
|

Updated on: Nov 27, 2026 | 10:55 AM

Share

రాజస్థాన్‌లోని దిద్వానా-కుచమన్ జిల్లాలో ఉన్న నువాన్ అనే చిన్న గ్రామానికి చెందిన ప్రియాంక ప్రజాపత్.. సురేష్ ప్రజాపత్ కుమార్తె, తాన్‌సుఖ్ ప్రజాపత్ మనవరాలు. ఆమె తండ్రి విదేశాల్లో పనిచేస్తున్నారు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా ప్రియాంక మాత్రం తన లక్ష్యాన్ని మర్చిపోలేదు. 12వ తరగతి వరకు స్వగ్రామంలోని పాఠశాలలోనే చదువుకుంది. అనంతరం ఉన్నత విద్య కోసం జైపూర్‌కు వెళ్లి సుబోధ్ కళాశాలలో విద్యను అభ్యసించింది. చదువుపై ఆసక్తి, నిరంతర శ్రమ, క్రమశిక్షణతో ముందుకు సాగింది. తన ప్రతిభతో కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలో ఆడిటర్ ఉద్యోగాన్ని సాధించింది. ఉద్యోగంలో చేరిన తర్వాత తొలిసారిగా స్వగ్రామానికి వచ్చిన ప్రియాంకకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆమె విజయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ ప్రజలు అభినందించేందుకు పెద్ద సంఖ్యలో ఇంటికి చేరుకున్నారు. ప్రియాంక చిన్నప్పటి నుంచే చదువుపై ఎంతో శ్రద్ధ చూపేదని ఆమె మామ శీష్పాల్ ప్రసాద్ తెలిపారు. ఆమె క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదలే ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెప్పారు. కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ కుల్దీప్ సింగ్ రాథోర్ నేతృత్వంలో గ్రామస్తులు ఆమెను ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ప్రియాంక సాధించిన విజయం కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎంతోమంది బాలికలకు ఆమె ఒక స్ఫూర్తిగా నిలిచింది. సరైన విద్య, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, కష్టపడే మనస్తత్వం ఉంటే గ్రామీణ ప్రాంతాల అమ్మాయిలు కూడా దేశంలోని ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు సాధించగలరని ఆమె నిరూపించింది. ముఖ్యంగా బాలికల విద్య, మహిళా సాధికారతకు ప్రియాంక విజయం ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది. ఇదే దిద్వానా జిల్లాకు చెందిన మరో యువతి దీపాలి రాథోడ్ కూడా ఇటీవల తన విజయంతో వార్తల్లో నిలిచారు. జుసారి గ్రామానికి చెందిన ఆమె భారత సైన్యంలోని మెడికల్ కార్ప్స్‌లో లెఫ్టినెంట్‌గా ఎంపికయ్యారు. లెఫ్టినెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి గ్రామానికి వచ్చినప్పుడు ఆమెకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు సంప్రదాయ పాటలు పాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు పూలమాలలతో ఆమెను సత్కరించారు.

ఇవి కూడా చదవండి

ఒకవైపు రక్షణ మంత్రిత్వ శాఖలో ఆడిటర్‌గా ప్రియాంక ప్రజాపత్, మరోవైపు భారత సైన్యంలో లెఫ్టినెంట్‌గా దీపాలి రాథోడ్.. ఇలా ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు సాధించిన విజయాలు ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నాయి. చిన్న గ్రామాల్లో పుట్టినంత మాత్రాన పెద్ద లక్ష్యాలను సాధించలేమని అనుకోవాల్సిన అవసరం లేదని వీరు నిరూపించారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, లక్ష్యంపై దృష్టి పెట్టి నిరంతరం కృషి చేస్తే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చనే సందేశాన్ని తమ విజయాలతో చాటిచెప్పారు.

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే