AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల రిలీజ్ డేట్స్ ప్రకటన.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలను ప్రకటించింది. శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో పాటు ఉచిత సర్వదర్శనం టోకెన్లను ఎప్పుడు విడుదల చేయనుందో వెల్లడించింది. ఈ నేపథ్యంలో భక్తులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోనే బుక్ చేసుకోవాలని సూచించింది.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల రిలీజ్ డేట్స్ ప్రకటన.
Ttd Vaikuntha Dwara Darshanam
Anand T
|

Updated on: Nov 27, 2026 | 2:54 PM

Share

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టికెట్లు, టోకెన్ల జారీ వివరాలను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 28న శ్రీవాణి టికెట్లు, నవంబర్ 30న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.

దర్శన టికెట్లు, టోకెన్ల తేదీల వివరాలు

నవంబర్ 28: ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్నట్టు టీడీపీ పేర్కొంది.

నవంబర్ 30: ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల కానుంది.

డిసెంబర్ 1 – 5: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం ఈ-డిప్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. డిసెంబర్ 1 ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు భక్తులు పేర్లు నమోదు చేసుకోవచ్చు.

డిసెంబర్ 7: మధ్యాహ్నం 3 గంటలకు ఈ-డిప్ ద్వారా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కేటాయింపు ఉంటుంది.

డిసెంబర్ 8: ఉదయం 10 గంటలకు దాతల దర్శన కోటా టికెట్లను విడుదల చేయనున్నారు.

తొలి రెండు రోజులు వీఐపీ బ్రేక్

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులైన డిసెంబర్ 20, 21 తేదీల్లో అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా పూర్తిగా రద్దు చేసింది. వీటి స్థానంలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఈ-డిప్ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో కేటాయించనుంది.

భక్తులు దళారులను నమ్మి మోసపోకుండా, దర్శన టికెట్లు మరియు టోకెన్లను కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే