AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడి హత్యకు స్కెచ్.. చివరకు ఎలా దొరికారంటే?

పల్నాడు జిల్లాలో దారుణ హత్య కలకలం రేపింది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ మహిళ తాను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని, తాను సన్నిహితంగా ఉంటున్న మరో వ్యక్తితో కలిసి దారుణంగా హత్య చేయించింది. బాధితుడి భార్య ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడి హత్యకు స్కెచ్.. చివరకు ఎలా దొరికారంటే?
Home Guard Murdered In Palnadu
T Nagaraju
| Edited By: |

Updated on: Nov 27, 2026 | 2:08 PM

Share

పల్నాడు జిల్లా గురజాల మండలం చర్లగుడిపాడుకు చెందిన షేక్ అలేఖ గత ఇరవై ఏళ్ల నుండి హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఈయనకు పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం అలేఖ కారంపూడి పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఈ నెల 14న గురజాల వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లిన అలేఖ.. రాత్రి 8 గంటలకు ఇంటికి వస్తున్నట్టు భార్యకు ఫోన్ చేశాడు. కానీ ఇంటికి మాత్రం తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన భార్య వెంటనే గురజాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మరుసటి రోజే స్థానికంగా ఉన్న ఓ దర్గా సమీపంలో అలేఖ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

భార్య ఇచ్చిన ఫిర్యాదులో అలేఖకు గురజాలకు చెందిన రమాదేవి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పేర్కొనడంతో అతని మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కోణంలోనే దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత 12 ఏళ్లుగా రమాదేవి, అలేఖ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే ఈ మధ్య కాలంలో వీరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు మొదలయ్యాయి. కొన్నాళ్ల క్రితం రమాదేవికి అలేఖ రూ.40 లక్షలు ఇచ్చాడు. అయితే ఇటీవల తన డబ్బులు తిరిగివ్వాలని అలేఖ రమాదేవిని కోరాడు. ఇవ్వకపోతే ఇల్లును అమ్ముతానని ఆమెను హెచ్చరించాడు.

అంతేకాకుండా రమాదేవి శ్రీకాంత్ అనే మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటం కూడా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. ఇప్పటికే అలేఖ పేరు మీద పెద్ద మొత్తంలోనే బీమా కూడా చేయించినట్లు తెలుస్తోంది. ఆర్థికపరమైన విషయాల్లో గ్యాప్ పెరగడం, ఇద్దరి మధ్య అనుమానాలు కూడా తలెత్తడంతో అలేఖ అడ్డు తొలగించుకోవాలని రమాదేవి భావించింది. తనకు పరిచయం ఉన్న శ్రీకాంత్, అతని స్నేహితుడైన మల్లికార్జునతో కలిసి ప్రణాళిక రచించింది. 14వ తేదీన రమాదేవి ఇంటి వద్ద నుండి వెళ్తున్న అలేఖను వెనుక నుండి ఢీకొట్టి చంపి, ప్రమాదంగా చిత్రీకరించే ప్రణాళిక రూపొందించారు.

అనుకున్నట్లుగానే వెనుక నుండి ఢీకొట్టారు. అయితే అలేఖ చనిపోకపోవడంతో అతని గొంతు నొక్కి చంపి, రోడ్డు పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో పడేశారు. అలేఖది పక్కా హత్యగా తేలడంతో పోలీసులు రమాదేవితో పాటు శ్రీకాంత్, మల్లికార్జునలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే