AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dads Little Friend Review: డాడ్స్ లిటిల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ.. మనసును తాకే చిన్న పిల్లల సినిమా..!

చిన్న పిల్లల ప్రధానంగా సాగే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఇటీవలే విడుదలైన 'సమ్మర్ హాలిడేస్' ప్రేక్షకుల మెప్పు పొందగా, తాజాగా 'డాడ్స్ లిటిల్ ఫ్రెండ్' అనే మరో చిత్రం వచ్చింది. శరత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై నమ్మకంతో ముందుగానే ప్రీమియర్స్ కూడా వేసారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Dads Little Friend Review: డాడ్స్ లిటిల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ.. మనసును తాకే చిన్న పిల్లల సినిమా..!
Dads Little Friend
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Nov 27, 2026 | 2:51 PM

Share

మూవీ రివ్యూ: డాడ్స్ లిటిల్ ఫ్రెండ్

నటీనటులు: రజత్ రాఘవ్, కాజల్ చౌదరి, బేబీ పరిణీత రుద్రరాజు, హసిని సుధీర్ తదితరులు

సినిమాటోగ్రఫీ: కుశ్వంత్ కుమార్

సంగీతం: RH విక్రమ్

నిర్మాత: దూప దీపక్

దర్శకుడు: శరత్

చిన్న పిల్లల ప్రధానంగా సాగే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఇటీవలే విడుదలైన ‘సమ్మర్ హాలిడేస్’ ప్రేక్షకుల మెప్పు పొందగా, తాజాగా ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ అనే మరో చిత్రం వచ్చింది. శరత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై నమ్మకంతో ముందుగానే ప్రీమియర్స్ కూడా వేసారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ: ఒంటరి మహిళ అయిన ఆకాంక్ష (కాజల్ చౌదరి) తన కూతురు పరిణీత అలియాస్ పరి (పరిణీత రుద్రరాజు)తో జీవిస్తుంటుంది. ఆమె భర్త ఎక్కడున్నాడు, ఏమయ్యాడు అనే విషయం ఎవరికీ తెలియదు. ఒక సందర్భంలో కూతురిని చైల్డ్ కేర్ సెంటర్‌లో ఉంచాలని ప్రయత్నించినా, ఆ పాప అక్కడ ఉండటానికి ఇష్టపడదు. ఈ క్రమంలోనే అనుకోకుండా ఆకాంక్ష మరణిస్తుంది. తల్లి లేకపోవడంతో ఒంటరిగా మిగిలిపోయిన పరి, తన స్నేహితుడితో ఆడుకుంటూ కాలం గడుపుతుంటుంది. దారాలతో అందమైన బొమ్మలు వేసే స్ట్రింగ్ ఆర్ట్ కళలో నైపుణ్యం ఉన్న పరి, ఆ కళ ద్వారానే డబ్బు సంపాదిస్తూ తన రోజువారీ అవసరాలు తీర్చుకుంటుంది. తల్లి ముందే ఇంటి అద్దె, బడి ఫీజులు ఒకేసారి చెల్లించి వెళ్లడంతో ఆర్థికంగా పెద్ద ఇబ్బంది లేకపోయినా, అమ్మానాన్నలు తోడు లేరనే వెలితి ఆ చిన్నారిని ఎప్పుడూ బాధిస్తుంటుంది. అయినప్పటికీ తల్లి చెప్పిన మాట ప్రకారం తన దైనందిన జీవితాన్ని కొనసాగిస్తుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే చిల్డ్రన్ కేర్ సెంటర్ సిబ్బంది ఇద్దరు పరి పరిస్థితిని పరిశీలించడానికి ఇంటికి వస్తారు. అదే వేళ ఎన్ఆర్ఐ అయిన రాహుల్ (రజత్ రాఘవ్) అక్కడికి వచ్చి, తానే పరి తండ్రినని ప్రకటిస్తాడు. అసలు పరిచయమే లేని అతడిని నాన్నగా అంగీకరించడానికి పరి నిరాకరిస్తుంది. అయినా ఆ పాప మనసు గెలుచుకోవడానికి రాహుల్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇంతకీ రాహుల్ ఎవరు, పరి కోసమే ఎందుకు వచ్చాడు? తాను తండ్రినని చెప్పడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆకాంక్ష తన కూతురికి తండ్రి గురించి ఎందుకు చెప్పలేదు? రాహుల్, ఆకాంక్ష మధ్య ఉన్న బంధం ఏంటి? ఇందులోని మలుపు ఏమిటి? చివరకు పరి అతడిని తండ్రిగా ఒప్పుకుందా లేదా? అనే అంశాల చుట్టూ మిగిలిన సినిమా సాగుతుంది.

కథనం:

చిన్నారుల మనస్తత్వం, వారి భావోద్వేగాల చుట్టూ అల్లుకునే కథలకు ఇటీవల మంచి ఆదరణ లభిస్తోంది. అదే కోవలో వచ్చిన ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ ప్రేక్షకులను మెప్పించే విషయంలో చాలా వరకు బాగానే సక్సెస్ అయిందని చెప్పొచ్చు.. అయితే కథ నడిపించే వేగంపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి, స్క్రీన్‌ప్లేను మరింత పకడ్బందీగా రాసుకుని ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. ఆరంభంలో తల్లి, కూతురి మధ్య ఉన్న అనుబంధాన్ని చూపిస్తూ కథలోకి తీసుకెళ్లిన దర్శకుడు, ఆ తర్వాత ఆకాంక్షకు ఏం జరిగిందనే ఆసక్తికరమైన ప్రశ్నతో సస్పెన్స్ క్రియేట్ చేశాడు. చిన్న వయసులోనే ఆ పాప ఇంట్లో ఒంటరిగా గడపడం, తల్లి నుంచి నేర్చుకున్న స్ట్రింగ్ ఆర్ట్‌తో మనసుకు ప్రశాంతత పొందుతూనే దానిని తన ఆదాయ మార్గంగా మార్చుకోవడం లాంటి అంశాలు హృదయాన్ని హత్తుకుంటాయి. బడికి సరిగ్గా వెళ్లకపోవడం, ఎప్పుడైనా వెళ్లినా తల్లి జ్ఞాపకంగా మిగిలిన టీషర్ట్ వేసుకునే వెళ్లడం ద్వారా అమ్మ జ్ఞాపకాల్లో ఆ చిన్నారి ఎంతగా లీనమైపోయిందో చాలా సున్నితంగా చూపించారు. కథ అలా సాగుతుండగా మధ్యలో రాహుల్ పాత్ర ప్రవేశంతో సినిమాలో కొత్త ఆసక్తి మొదలవుతుంది. అసలు ఆ కొత్త వ్యక్తి ఎవరో తెలియక పాప అయోమయానికి గురవడం, అతడు నేరుగా తానే తండ్రినని చెప్పడంతో కథ అనూహ్య మలుపు తీసుకుంటుంది.

పరిని దగ్గర చేసుకోవడానికి రాహుల్ చేసే విచిత్రమైన ప్రయత్నాలు నవ్వు తెప్పిస్తాయి, వాటికి ఆ చిన్నారి ఇచ్చే స్పందనలు భలే క్యూట్‌గా అనిపిస్తాయి. కాకపోతే ఆ సన్నివేశాలను అవసరానికి మించి కొంత సాగదీసిన భావన కలుగుతుంది. అయినప్పటికీ విరామ సమయానికి కథ ఆసక్తికరమైన మలుపు దగ్గర ఆగుతుంది. సెకండాఫ్ అంతా ఆ చిన్నారి నమ్మకాన్ని గెలవడానికి రాహుల్ పడే తాపత్రయం చుట్టూ తిరుగుతుంది. తన కళా నైపుణ్యంతో పాపకు ఆశ్చర్యాన్ని కలిగించడం, పుట్టినరోజు వేడుకలు జరపడం లాంటి ఘట్టాలు భావోద్వేగాన్ని పండిస్తాయి. ముఖ్యంగా ముగింపు ఘట్టాన్ని చాలా ఆసక్తికరంగా, మనసును తాకేలా తీర్చిదిద్దారు. తల్లి గదిలోని జ్ఞాపకాలను రాహుల్ చూడటం, అందులో దొరికిన డైరీలోని విషయాలు కంటతడి పెట్టించేలా ఉంటాయి. చివరి మలుపు మరీ ఊహకందని స్థాయిలో గొప్పగా లేకపోయినా, కథకు తగ్గట్టుగా పర్వాలేదనిపిస్తుంది. ముగింపు సన్నివేశాలతో సినిమా మంచి అనుభూతిని ఇస్తుంది. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల ప్రాముఖ్యత, చిన్న వయసులో స్వతంత్రంగా ఎదగడం, కుటుంబ పరిస్థితులు, క్షణికావేశంలో చేసే పొరపాట్ల వల్ల ఎదురయ్యే తీవ్ర పరిణామాలను చర్చించిన తీరు ఆలోచింపజేస్తుంది.

నటీనటులు:

ఈ సినిమాకు ప్రధాన బలం బేబీ పరిణీత రుద్రరాజు. పరి పాత్రలో ఆ చిన్నారి అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. వయసుకు మించిన పరిణతితో కూడిన హావభావాలు పలికిస్తూ సినిమా భారాన్ని మొత్తం తన భుజాలపై మోసింది. రాహుల్ పాత్రలో రజత్ రాఘవ్ ఎంతో హుందాగా, హద్దుల్లో ఉంటూ పరిణతి చెందిన నటనతో మెప్పించాడు. పరి తల్లి ఆకాంక్షగా కాజల్ చౌదరి తనకు దక్కిన నిడివిలో సహజంగా నటించింది. పరి స్నేహితుడిగా నటించిన బాలుడు తన చలాకీతనంతో నవ్వులు పూయిస్తూ ఆకట్టుకున్నాడు. రాహుల్‌ను ఇష్టపడే యువతిగా హసిని సుధీర్ ఉన్నంతలో పర్వాలేదనిపించినా, వీరిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు అంతగా పండలేదు. గుండు సుదర్శన్ తనదైన శైలిలో కాసేపు వినోదాన్ని పంచగా, మిగిలిన నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

RH విక్రమ్ అందించిన సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ఎమోషనల్ సీన్స్‌ను ఆయన రీ-రికార్డింగ్ మరో స్థాయికి తీసుకెళ్లింది. కుశ్వంత్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. రంగురంగుల ఆహ్లాదకరమైన దృశ్యాలతో సినిమా స్థాయిని పెంచాడు. అయితే ఎడిటింగ్ విభాగంలో మరింత పదును అవసరమనిపిస్తుంది, సాగదీసిన కొన్ని సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే బాగుండేది. దర్శకుడు శరత్ మంచి కథా వస్తువును ఎంచుకున్నప్పటికీ, ఆ డ్రామాను మరింత బలంగా పండించడంలో అక్కడక్కడా తడబడ్డాడు. కొన్ని సన్నివేశాల్లో వేగం తగ్గడం, తల్లి పాత్రపై పూర్తి క్లారిటీ ఇవ్వకపోవడం మైనస్ అయినా.. ద్వితీయార్థాన్ని, ముగింపును హృద్యంగా నడిపించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’.. నెమ్మదిగా సాగినా.. ఆలోచింపజేసే సినిమా..!

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే