AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema OTT: ఇదెక్కడి సినిమా భయ్యా.. ఓటీటీలో గత్తరలేపుతున్న రొమాంటిక్ థ్రిల్లర్..

సాధారణంగా సౌత్ ఇండస్ట్రీలో మలయాళీ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. హారర్ సినిమాలే కాదు సస్పెన్స్, థ్రిల్లింగ్ మిస్టరీ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ మూవీ రెండు వారాలుగా డిజిటల్ ప్లాట్ ప్లామ్ లో దుమ్మురేపుతుంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా ఏంటో తెలుసా.. ?

Rajitha Chanti
|

Updated on: Nov 27, 2026 | 2:44 PM

Share
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు సరికొత్త చిత్రాలు సందడి చేస్తుంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ ఒకటి. ప్రతిష్టాత్మక చిత్రోత్సవాల్లో గుర్తింపు పొందిన వైవిధ్యమైన చిత్రాలు ఓటీటీ వేదికలపైకి వచ్చినప్పుడు సినీ ప్రియుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. ఆ కోవలోనే 29వ కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భారతీయ భాషా చిత్రాల పోటీ విభాగానికి ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించిన తమిళ థ్రిల్లర్ డ్రామా సాయవనం

1 / 5
ఇప్పుడు ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. తమిళంతో పాటు తెలుగు వెర్షన్‌లోనూ అందుబాటులోకి రావడమే కాదు ఓటీటీలో ట్రెండింగ్ అవుతుంది.  అనిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సాయవనం కథ ఒక బలమైన మహిళా పాత్ర చుట్టూ తిరుగుతుంది. సామాజిక, మతపరమైన నియమాలను పాటిస్తూ నిజాయతీగా, హుందాగా జీవించాలని ప్రయత్నించే సీత (దేవనంద శైజిలాల్) జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు ఈ కథకు ప్రాణం.

2 / 5
తన చుట్టూ ఉన్న పురుషుల అసలు ఉద్దేశాలు, మోసపూరిత ధోరణులను సీత ఎలా గ్రహించింది? క్లిష్టమైన పరిస్థితుల్లో తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ, ధైర్యవంతురాలిగా, పోరాటయోధురాలిగా ఆమె ఎలా నిలబడిందనే అంశాన్ని దర్శకుడు థ్రిల్లర్, డ్రామా అంశాల మేళవింపుతో ఆవిష్కరించారు. ఈ చిత్రంలో సీత పాత్రలో దేవనంద శైజిలాల్ నటించగా, కీలకమైన సురుళి పాత్రను సంతోష్ దామోదరన్ పోషించారు.

3 / 5
సురుళి పాత్ర కథలో కీలక మలుపులకు కారణమవుతుంది. వీరితో పాటు సౌందరరాజ (ముత్తు), అప్పుకుట్టి (మురుగన్), జానకి జయరామన్ (అర్పుతమ్మ), వెట్రివేల్ రాజా (సింగారం), మాథ్యూ మాంప్ర (రేంజర్) ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. డమోర్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సంతోష్ దామోదరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విభిన్న భాషల్లో 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన అనిల్ కుమార్, సాయవనంతో తమిళంలో తన దర్శకత్వ ప్రస్థానాన్ని ప్రారంభించడం విశేషం.

4 / 5
 విజు రామచంద్రన్ స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి ఎల్. రామచంద్రన్ సినిమాటోగ్రఫీ, అరుల్ సిద్ధార్థ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. కుట్టి రేవతి సాహిత్యం అందించగా, పోలి వర్గీస్ సంగీతం సమకూర్చారు. చిత్రోత్సవంలో ఎంపికైన నాటి నుంచే మంచి ప్రశంసలు అందుకున్న ఈ థ్రిల్లర్ డ్రామా, ఇప్పుడు ఓటీటీలోనూ థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా ప్రేక్షకుల వాచ్‌లిస్ట్‌లో ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

5 / 5
Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల

ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?

కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు

ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్

ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది

పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు

కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు

వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు

మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే