AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోన్ కాల్స్ విషయంలో బీ కేర్ ఫుల్.. ఈ ఒక్క పని చేస్తే చాలు !!

మనం చేసే ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు లేదా ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో.. వచ్చే స్పామ్ కాల్స్, మెసేజ్‌లు తీవ్రమైన అసహనాన్ని కలిగిస్తాయి. జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ వంటి టెలికాం యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్లలో కొన్ని సింపుల్ మార్పులు చేసుకుంటే ఈ వేధింపుల నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు.

ఫోన్ కాల్స్ విషయంలో బీ కేర్ ఫుల్.. ఈ ఒక్క పని చేస్తే చాలు !!
Spam Calls
Korivi Jayakumar
|

Updated on: Nov 27, 2026 | 3:02 PM

Share

మనం చేసే ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు లేదా ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో.. వచ్చే స్పామ్ కాల్స్, మెసేజ్‌లు తీవ్రమైన అసహనాన్ని కలిగిస్తాయి. ఇక ఈ మధ్య కాలంలో అయితే సైబర్ కేటుగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాయిస్ క్లోనింగ్, నకిలీ లింక్‌లతో సరికొత్త మోసాలకు కూడా తెరలేపుతున్నారు. కేవలం సాధారణ ప్రకటనలే కాకుండా, బ్యాంక్ కేవైసీ, లోన్ల పేరుతో సర్వసాధారణంగా మారుతున్న ఈ స్పామ్ బెడదకు అడ్డుకట్ట వేయడం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అత్యవసరం. జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ వంటి టెలికాం యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్లలో కొన్ని సింపుల్ మార్పులు చేసుకుంటే ఈ వేధింపుల నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు. ఆ సీక్రెట్ సెట్టింగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఒక్క మెసేజ్‌తో చెక్..

కాగా మీరు ఏ సిమ్ వాడుతున్నా సరే.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అందిస్తున్న ‘డూ నాట్ డిస్టర్బ్’ (DND) సర్వీస్ ద్వారా ప్రమోషనల్ కాల్స్‌ను బ్లాక్ చేయవచ్చు. దీనికోసం మీ ఫోన్ మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి START 0 అని టైప్ చేసి 1909 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మెసేజ్ వద్దనుకుంటే నేరుగా 1909 నంబర్‌కు కాల్ చేసి, ఐవీఆర్ (IVR) సూచనల ప్రకారం మీకు వద్దనుకున్న కేటగిరీలను బ్లాక్ చేసుకోవచ్చు. ఈ రిక్వెస్ట్ పెట్టిన 24 గంటల్లోపు DND యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ ఆ తర్వాత కూడా స్పామ్ కాల్స్ వస్తే, ప్లేస్టోర్‌లోని TRAI DND 3.0 యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

కంపెనీ వారీగా ఎలా చెయాలంటే..

Jio : మై జియో (MyJio) యాప్ ఓపెన్ చేసి కుడివైపు కింద ఉండే ‘మెనూ’ (Menu) లేదా ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. అందులో ‘సెట్టింగ్స్’ (Settings) లోకి వెళ్లి ‘సర్వీస్ సెట్టింగ్స్’ ఎంచుకోవాలి. అక్కడ కనిపించే ‘డూ నాట్ డిస్టర్బ్’ (Do Not Disturb) ఆప్షన్‌పై నొక్కితే ఫుల్ DND (అన్ని ప్రమోషనల్ కాల్స్ బ్లాక్) లేదా పార్షియల్ DND (కేవలం బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ వంటి ఎంపిక చేసినవి మాత్రమే బ్లాక్) ఆప్షన్లు కనిపిస్తాయి.

Airtel : ఎయిర్‌టెల్ థ్యాంక్స్ (Airtel Thanks) యాప్ ఓపెన్ చేసి, అందులో ‘మోర్’ (More) లేదా ‘సర్వీసెస్’ విభాగంలోకి వెళ్లాలి. కిందికి స్క్రోల్ చేస్తే ‘DND’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, మీకు ఏ తరహా కాల్స్ వద్దో ఎంచుకుని సబ్మిట్ చేయాలి. అంతేకాకుండా, ఎయిర్‌టెల్ ఇటీవల తీసుకొచ్చిన ఏఐ-ఆధారిత స్పామ్ డిటెక్షన్ టూల్ వల్ల అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు స్క్రీన్‌పైనే ‘Suspected Spam’ అని రెడ్ కలర్‌లో హెచ్చరిక కూడా కనిపిస్తుంది.

Vi: వొడాఫోన్ ఐడియా (Vi) యూజర్లు వీఐ యాప్ ఓపెన్ చేసి ‘మై అకౌంట్’ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ ‘ఫైండ్ సర్వీసెస్’ కింద ఉండే DND ఆప్షన్‌ను ఎంచుకుని, మీకు నచ్చిన కేటగిరీలను బ్లాక్ చేసుకుని సబ్మిట్ చేయాలి.

BSNL ; బీఎస్ఎన్ఎల్ (BSNL) యూజర్లకు యాప్ కంటే ఎస్ఎంఎస్ విధానమే సులభం. 1909 నంబర్‌కు START 0 అని మెసేజ్ పంపడం ద్వారా లేదా కాల్ చేసి ఐవీఆర్ సూచనలు పాటించడం ద్వారా అన్ని రకాల ప్రమోషనల్ కాల్స్‌ను నిలిపివేయవచ్చు.

ఫోన్ సెట్టింగ్స్‌లో కూడా..

నెట్‌వర్క్ DND తో పాటు మీ స్మార్ట్‌ఫోన్‌లోని బిల్ట్-ఇన్ ఫీచర్‌ను వాడటం వల్ల మరింత రక్షణ లభిస్తుంది.

ఆండ్రాయిడ్ : ఫోన్ డయలర్ యాప్ ఓపెన్ చేసి పైన కుడివైపు ఉండే మూడు చుక్కల (Three Dots) పై నొక్కి ‘Settings’ లోకి వెళ్లండి. అక్కడ Caller ID & spam ఆప్షన్‌పై క్లిక్ చేసి, ‘See caller and spam ID’ మరియు ‘Filter spam calls’ అనే రెండు ఆప్షన్లను ఆన్ చేసుకోండి. దీనివల్ల ఫేక్ కాల్స్ అసలు రింగ్ అవ్వకుండానే ఆటోమేటిక్‌గా బ్లాక్ అవుతాయి.

ఐఫోన్ : సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Phone’ ఆప్షన్ ఎంచుకుని, కిందికి స్క్రోల్ చేస్తే Silence Unknown Callers కనిపిస్తుంది. దీన్ని ఆన్ చేసుకుంటే మీ కాంటాక్ట్స్‌లో లేని కొత్త నంబర్ల నుంచి వచ్చే కాల్స్ అన్నీ సైలెంట్‌గా వాయిస్ మెయిల్‌కు వెళ్లిపోతాయి.

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే