AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్.. ఇప్పుడేమో బుల్లితెరపై అదరగొడుతున్నాడు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్ అని చెప్పవచ్చు. పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించిన అతను విలన్ గానూ, సహాయక నటుడిగానూ మెప్పించాడు. అలాగే బిగ్ బాస్ వంటి రియాలిటీ షోల్లోనూ, టీవీల్లోనూ సందడి చేస్తున్నాడు.

Tollywood: ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్.. ఇప్పుడేమో బుల్లితెరపై అదరగొడుతున్నాడు
Tollywood Actor
Basha Shek
|

Updated on: May 29, 2026 | 11:02 AM

Share

పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తోన్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ లో ఫేమస్ హీరో. ఇప్పుడంటే పెద్దగా సినిమాలు చేయట్లేదు కానీ ఒకప్పుడు తెలుగులో వరుసగా ప్రేమకథా చిత్రాలు చేశాడు. టాలీవుడ్ లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గానూ, సహాయక నటుడిగానూ మెప్పించాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ ఆకట్టుకున్నాడు. అయితే సినిమాలతో పాటు నిత్యం వివాదాలతోనూ వార్తల్లో నిలిచాడు. ముఖ్యంగా డ్రగ్స్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 2023 సెప్టెంబర్ లో హైదరాబాద్ లో పట్టుబడిన ఓ డ్రగ్స్ ముఠా కేసులో ఈ హీరో పేరు బాగ వినిపించింది. ఇతను డ్రగ్స్ వినియోగదారుడని , నిందితులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన పోలీసులు ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేశారు. దీంతో చాలా సార్లు విచారణకు కూడా హాజరయ్యాడీ హీరో. అయితే ఈ ఏడాది ప్రారంభంలో డ్రగ్స్ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసుతో సదరు హీరోకు ఎలాంటి సంబంధంలేదని క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఈ హీరో మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. హీరోగా కాకపోయినా మంచి పాత్రలతో అలరిస్తున్నాడు. అలాగే బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నాడు. అతను మరెవరో కాదు చాక్లెట్ బాయ్ నవదీప్.

హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు నవదీప్. ఇక్కడే చదువు పూర్తి చేశాడు. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన జై సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమా, గౌతమ్ ఎస్.ఎస్.సి., సీతాకోక చిలుక, చందమామా సినమాల్లో హీరోగా నటించాడు. అలాగే ఆర్య 2, రెడీ, ఓ మై ఫ్రెండ్, బాద్ షా, ధ్రువ, నేనే రాజు నేనే మంత్రి తదితర సినిమాల్లో విలన్ గా, సహాయక నటుడిగానూ ఆకట్టుకున్నాడు. చివరిగా 2024లో రిలీజైన లవ్ మౌళి అనే సినిమాలో హీరోగా నటించాడు నవదీప్. అలాగే గతేడాది సంచలన విజయం సాధించిన దండోరా సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించాడు.

ఇవి కూడా చదవండి

నవదీప్ లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Nav Deep 2.0 (@pnavdeep)

ప్రస్తుతం బుల్లితెరపై బిజీ బిజీగా ఉంటున్నాడు నవదీప్. గతేడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అగ్ని పరీక్షకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఈ హీరో ఇప్పుడు పలు టీవీ షోస్ లో సందడి చేస్తున్నాడు.

View this post on Instagram

A post shared by Nav Deep 2.0 (@pnavdeep)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us