AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: పగతో బ్యాంకుల్ని కొల్లగొట్టే హీరో.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ సూపర్ హిట్.. తెలుగుతో సహా..

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడీ సినిమా గురువారం (మే 28) అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో సహా ప్రధాన భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది.

OTT Movie: పగతో బ్యాంకుల్ని కొల్లగొట్టే హీరో.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ సూపర్ హిట్.. తెలుగుతో సహా..
OTT Movie
Basha Shek
|

Updated on: May 28, 2026 | 6:55 AM

Share

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటస్ట్ సినిమా కర. విఘ్నేశ్ రాజా తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో మమిత బైజు హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 30న తెలుగు, తమిళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో ధనుష్ ‘కరస్వామి’ అనే లోకల్ దొంగ పాత్రలో కనిపించారు. ధనుష్ గత చిత్రాల రేంజ్ లో ఈ సినిమా ఆడనప్పటికీ హీరో నటన, యాక్షన్ సన్నివేశాలు మంచి ప్రశంసలు అందుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ బాగుందని రివ్యూలు వచ్చాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడన కర సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నెల 28 నుంచి కర సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. చెప్పినట్లు గానే గురువారం (మే 28) ధనుష్ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చింది నెట్ ఫ్లిక్స్. తెలుగు, తమిళంతో పాటు ప్రధాన భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐషరి కె గణేష్ నిర్మించిన కర సినిమాను తెలుగు ప్రేక్షకులకు విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ సంయుక్తంగా అందించాయి. ఈ మూవీలో హీరో, హీరోయిన్లతో పాటు సూరజ్ వెంజరమూడు, కే.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ రాజన్, శ్రీజ రవి, ఆడుకలం నరేన్, రవి మరియా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.

కర సినిమా కథ విషయానికి వస్తే.. కరస్వామి (ధనుష్) ఒక దొంగ. ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి (మమిత బైజు) కోసం తన నేర జీవితాన్ని వదిలేసి మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. ఒక హోటల్ పెట్టుకోవడానికి ఊరిలో ఉన్న పొలం కాగితాలు బ్యాంకులో తాకట్టు పెట్టాలనుకుంటాడు. ఆ కాగితాల కోసమే చాలా సంవత్సరాల తర్వాత తన తండ్రి (కేఎస్ రవికుమార్) వద్దకు వెళతాడు. అయితే అక్కడ బ్యాంకు అధికారుల క్రూరత్వంతో అనుకోకుండా తన తండ్రిని కోల్పోతాడు. మరి ఆ తర్వాత కరస్వామి జీవితంలో ఎదురైన పరిస్థితులు ఏంటీ.. ? తన జీవితంలోకి ముత్తు సెల్వన్ (జయరామ్ ) ఎలా వచ్చాడు అనేది సినిమా. మరి థియేటర్లలో ధనుష్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us