AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Gouri Priya: మా అమ్మ నన్ను వదిలేసి 3 ఏళ్లు అయింది.. హీరోయిన్ శ్రీ గౌరిప్రియ జీవితంలో ఇంత విషాదముందా?

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది శ్రీ గౌరి ప్రియ. ఈ తెలుగమ్మాయి ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో కలిసి ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఈవెంట్ లో గౌరి ప్రియ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Sri Gouri Priya: మా అమ్మ నన్ను వదిలేసి 3 ఏళ్లు అయింది.. హీరోయిన్ శ్రీ గౌరిప్రియ జీవితంలో ఇంత విషాదముందా?
Sri Gouri Priya
Basha Shek
|

Updated on: May 26, 2026 | 7:23 PM

Share

ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ. ప్రముఖ టీవీ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ నిర్మలా కాన్వెంట్, మనలో ఒకడు, ఫిదా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఇదే క్రమంలో 2018లో మిస్ హైదరాబాద్ టైటిల్ గెల్చుకుంది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో 2021లో తొలిసారి మెయిల్ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసింది గౌరి ప్రియ. ఆ తర్వాత లవ్ స్టోరీ, శ్రీకారం, రైటర్ పద్మభూషణ్ తదితర సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. అయితే ఈ అమ్మడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది మ్యాడ్ సినిమా అని చెప్పవచ్చు. అలాగే రైటర్ పద్మభూషణ్ మూవీలోనూ ఈ ముద్దుగుమ్మ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవలే హ్యాపీరాజ్ అనే సూపర్ హిట్ సినిమాలోనూ కథానాయికగా చేసిందీ అందాల తార. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు తెలుగు, తమిళ క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో కిరణ్ అబ్బవరంతో కలిసి నటిసస్తోన్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఒకటి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన కంటెంట్ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘వదలనే’ అనే సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు.

సోమవారం (మే 25) రాత్రి ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ నుంచి ‘వదలనే’ సాంగ్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ సందర్భంగా తల్లిని గుర్తు చేసుకుంటూ గౌరి ప్రియ ఎమోషనల్ అయింది. ఈ ఈవెంట్ కు యాంకర్ గా వ్యవహరించిన స్రవంతి వదలనే సాంగ్ లిరిక్స్ ను ఎవరికీ అంకితం చేస్తారని గౌరిప్రియను అడిగింది. దీనికి సమాధానమిచ్చిన ఆమె .. ‘నిజంగా చెప్పాలంటే మా అమ్మ నన్ను వదిలేసి మూడేళ్లయింది. కానీ తను నన్ను అస్సలు వదల్లేదు. నేను తనను వదలను. ఈ విషయం తనకు తెలుసు, నాకు తెలుసు. ఈ లైన్స్ మా అమ్మకే డెడికేట్ చేస్తున్నా’ అని చెబుతూ ఎమోషనల్ అయ్యింది గౌరిప్రియ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

చెన్నై లవ్ స్టోరీ సినిమాలో కిరణ్ అబ్బవరం, గౌరి ప్రియ..

క్యాన్సర్ తో తల్లి మరణం..

శ్రీ గౌరి ప్రియ తల్లి వసుంధర మూడేళ్ల క్రితం చనిపోయారు. క్యాన్సర్ తో చాలా ఏళ్లు పోరాటం చేసిన ఆమె 2023లో తుది శ్వాస విడిచారు. అమ్మ అంటే గౌరి ప్రియకు చాలా ఇష్టం. . అందుకే తల్లి కన్నుమూసిన సమయంలో గౌరి ప్రియ బాగా కుంగిపోయింది. ఆ తర్వాత కోలుకుని మళ్లీ సినిమాలపై దృష్టి సారించింది. ఇక ‘చెన్నై లవ్ స్టోరీ సినిమా విషయానికి వస్తే.. రవి నంబూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

View this post on Instagram

A post shared by Filmfare (@filmfare)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us